మావటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏనుగును పనిచేయిస్తున్న మావటీ
ఏనుగును నడిపిస్తున్న మావటి-16 వ శతాబ్దం నాటిది చిత్రం

మావటి అంటే ఏనుగును మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది.[1] వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని అంకుశం అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు.

సంస్కృతంలో వీళ్ళను రెగావాన్, యుక్తిమాన్, బల్వాన్ అని మూడు రకాలుగా వర్గీకరించారు. రెగావాన్ అంటే ప్రేమతో లొంగదీసుకునే వారు. యుక్తిమాన్ అంటే తెలివితో లొంగదీసుకునే వారు. బల్వాన్ అంటే శక్తితో లొంగ దీసుకునేవారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-11-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-10-29. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మావటి&oldid=2810290" నుండి వెలికితీశారు