మిడసల వెంకట సుబ్బయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిడసల వెంకట సుబ్బయ్య కమ్యూనిస్టు పార్టీ నాయకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

మిడసల వెంకట సుబ్బయ్య నిరుపేద దళిత కుటుంభంలో మిడసల వెంటస్వామి, శేషమ్మ దంపతులకు మూడవ సంతానంగా 1929 జూలై 1 న జన్మించాడు. 1952 లో భారత కమ్యునిస్టు పార్టీలో సభ్యులుగా పాపని వెంకట సుబ్బయ్య, గుండాబత్తిని వెంకటేశ్వర్లు, పరాంకుశం నరసింహారావు, షేక్ పీర్ సాహెబ్, జంగం కోట్లింగం, గార్లతో కలిసి గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతను ప్రోత్సహించాడు. కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశాడు. కమ్యునిస్టు పార్టీ ప్రకాశంజిల్లా అద్యక్షులుగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. పలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. సిపిఐ లో బలమైన నాయకుడుగా ఎదిగాడు. పలు భూపోరాటాలు, ప్రజాఉద్యమాలు నడిపి పేదలకు న్యాయం చేశాడు. శాంతినగర్ కాలనీ నిర్మాణం చేసి 120 మంది హరిజనులకు ఇంటి వసతి కల్పించి, కుటుంబానికి ఒక ఎకరా పొలంకూడా ఇప్పించాడు. చివరి స్వాసవరకు ప్రజల పక్షాన పనిచేసి 2002 నవంబరు 6న మరణించాడు. ఆయన సేవలకు గుర్తింపుగా శాంతినగర్ కాలనీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని కాలనీ వాసులు నిర్వహిస్తారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "విశాలాంధ్ర, ప్రకాశం జిల్లా- 2016 నవంబరు 7" (PDF). Archived from the original (PDF) on 2019-08-01. Retrieved 2019-08-01.