Jump to content

మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం

అక్షాంశ రేఖాంశాలు: 12°16′32″N 93°01′34″E / 12.27556°N 93.02611°E / 12.27556; 93.02611
వికీపీడియా నుండి
మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం
Location within India
Locationఅండమాన్ నికోబార్, భారతదేశం
Coordinates12°16′32″N 93°01′34″E / 12.27556°N 93.02611°E / 12.27556; 93.02611
Area64 కి.మీ2 (25 చ. మై.)
Established1979

మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి అండమాన్ నికోబార్లో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1979 లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 64 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇది పోర్ట్ బ్లెయిర్ నగరానికి ఈశాన్యంగా 200 కిమీ. దూరంలో ఉంది.[2]

వృక్ష, జంతు సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనంలో తేమతో కూడిన ఆకురాల్చే అడవితో నిండి ఉంది. దీని చుట్టూ ఇసుక బీచ్‌లు, స్పష్టమైన నీటితో నిస్సార సముద్రాలు ఉంటాయి. ఇందులో రట్టన్ పామ్ కలామస్ పలస్ట్రిస్, క్లైంబింగ్ వెదురు డైనోక్లోవా అండమానికా, పారిషియా ఇన్సిగ్నిస్, కలోఫిలమ్ సౌలాత్రి, ఆర్టోకార్పస్, కానరియం, డిప్టెరోకార్పస్ గ్రాండిఫ్లోరస్, డిప్టెరోకార్పస్ పైలోసస్, ఎండోస్పెర్సోలాస్ సప్లాస్ బక్కౌరియా సపిడా, కార్యోటా మిటిస్, డైనోక్లోవా పలస్ట్రిస్ వంటి అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మచ్చల జింకలు, నీటి బల్లులు, మానిటర్ బల్లులు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో కనిపించే సముద్ర జంతుజాలంలో దుగోంగ్స్, డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్లు, నీలితిమింగాలలు ఉన్నాయి.[3]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవన ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత సుమారు 20, 30 ° C మధ్య ఉంటుంది. ఈ ఉద్యనవనాన్నికి జూన్, అక్టోబర్ నెలల మధ్య నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ప్రాంతానికి చాలా మంది సందర్శకులు డిసెంబర్, ఏప్రిల్ మధ్య వస్తారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి పడవ ద్వారా ఈ ఉద్యానవనాన్నికి చేరుకోవచ్చు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Middle Button Island National Park in India". Wildlife Sanctuaries in India. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 28 అక్టోబరు 2019.
  2. Hoyt, Erich (2012). Marine Protected Areas for Whales, Dolphins and Porpoises: A World Handbook for Cetacean Habitat Conservation and Planning. Routledge. p. 282. ISBN 978-1-136-53830-8.
  3. Negi, Sharad Singh (2002). Handbook of National Parks, Wildlife Sanctuaries, and Biosphere Reserves in India. Indus Publishing. pp. 51–52. ISBN 978-81-7387-128-3.
  4. "South Button Island National Park, Andaman and Nicobar Islands". Trans India Travels. Archived from the original on 28 అక్టోబరు 2019. Retrieved 28 October 2019.