మిన్నసోటా విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిన్నసోటా విశ్వవిద్యాలయం (English: University of Minnesota) అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మిన్నసోటా రాష్ట్రంలో కల ఒక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల వ్యవస్థ. అందులో ప్రధానమైన, అతి పెద్ద క్యాంపస్ జంటనగరాలుగా ప్రసిధ్ది గాంచిన మిన్నియాపొలిస్, సెయింట్ పాల్లో ఉంది. [1] ట్విన్ సిటీస్ క్యాంపస్ మిన్నెసోటా విశ్వవిద్యాలయ వ్యవస్థలో అత్యంత పురాతనమైనది, అతిపెద్దది. ప్రధాన క్యాంపస్ విద్యార్థుల సంఖ్యలో ఇది అమెరికా లోకెల్లా ఆరవ అతిపెద్దది. 2019-20లో ఇందులో 51,327 మంది విద్యార్థులు ఉన్నారు. [2] ఇది మిన్నెసోటా విశ్వవిద్యాలయం లోని ప్రధాన సంస్థ. దీన్ని 19 కళాశాలలు, పాఠశాలలు, ఇతర ప్రధాన విద్యా విభాగాలుగా విభజించారు.

మిన్నెసోటా విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీలలో సభ్యురాలు. పరిశోధన కార్యకలాపాల్లో ఇది అమెరికాలో 17 వ స్థానంలో ఉంది, 2018 ఆర్థిక సంవత్సరంలో పరిశోధనపై 954 మిలియన్లు వ్యయం చేసింది. [3]

మిన్నెసోటా విశ్వవిద్యాలయ లోని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, పరిశోధకులు మొత్తం 26 నోబెల్ బహుమతులు [4], మూడు పులిట్జర్ బహుమతులూ గెలుచుకున్నారు . [5] మిన్నెసోటా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఇద్దరు హుబెర్ట్ హంఫ్రీ, వాల్టర్ మోండేల్ లు అమెరికా ఉపాధ్యక్షులయ్యారు. 2016 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన బాబ్ డైలాన్ కూడా ఇక్కడి పూర్వ విద్యార్థే. [6]

చరిత్ర[మార్చు]

మిన్నెసోటా విశ్వవిద్యాలయాన్ని మిన్నియాపాలిస్‌లో 1851 లో, మిన్నెసోటా రాష్ట్రం ఏర్పడడానికి ఏడు సంవత్సరాల ముందు, కళాశాల సన్నాహక పాఠశాలగా స్థాపించారు. [7] తొలినాళ్ళలో ఇది పలు కష్టాలు పడింది. దక్షిణ కెరోలినా గవర్నరు విలియం ఐకెన్ జూనియర్ వంటి సహా వివిధ దాతలు ఇచ్చే విరాళాలపై ఆధారపడింది. [8] [9] 1867 లో, విశ్వవిద్యాలయం 1862 నాటి మోరిల్ చట్టం ద్వారా భూమి మంజూరు చేయించుకునే హోదాను పొందింది. [10] [11]

పిండి మిల్లు సొంతదారు జాన్ ఎస్. పిల్స్‌బరీ, 1876 లో ఇచ్చిన విరాళం, పాఠశాలను కాపాడిన ఘనత పొందింది. [12] [13] అప్పటి నుండి, పిల్స్‌బరీని ఈ "విశ్వవిద్యాలయ పితామహుడు"గా ప్రసిద్ధి చెందాడు. [14] అతని గౌరవార్థం పిల్స్‌బరీ హాలుకు ఆ పేరు పెట్టారు. [15] [16]

మూలాలు[మార్చు]

 1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 4. University of Minnesota Scholars Walk: Nobel Prize. University of Minnesota. URL accessed on December 15, 2016.
 5. University of Minnesota Scholars Walk: Pulitzer Prize. University of Minnesota. URL accessed on December 15, 2016.
 6. The Nobel Prize in Literature 2016.
 7. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 8. Lehman, Christopher P (2017). "Slaveholder Investment in Territorial Minnesota". Minnesota History. 65 (7): 270–272. JSTOR 26368724.
 9. Brown, Curt (June 20, 2016). "Minnesota History: Southern slave owner helped revive University of Minnesota". Star-Tribune. Minneapolis, Minn. Retrieved March 17, 2020.
 10. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 11. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
 12. Lehman, Christopher P (2017). "Slaveholder Investment in Territorial Minnesota". Minnesota History. 65 (7): 270–272. JSTOR 26368724.
 13. Brown, Curt (June 20, 2016). "Minnesota History: Southern slave owner helped revive University of Minnesota". Star-Tribune. Minneapolis, Minn. Retrieved March 17, 2020.
 14. Carney, Mary Vance (1918). Minnesota: the star of the North. D. C. Heath & co. p. 218.
 15. Minnesota. University (1921). Bulletin. Minnesota. University. p. 67.
 16. Millett, Larry (2007). AIA Guide to the Twin Cities: The Essential Source on the Architecture of Minneapolis and St. Paul. Minnesota Historical Society. p. 132. ISBN 9780873515405.