మియా ముఖి
మియా ముఖి | |
---|---|
జననం | ము ఖిమియా 1987 మే 20 చుక్సియాంగ్ యి అటానమస్ ప్రిఫెక్చర్, యునాన్, చైనా |
వృత్తి | నటి, యోగా ట్రైనర్ |
మియా ముఖి (చైనీస్: 母其弥雅; జననం 1987 మే 20), కుంగ్ ఫూ యోగా (2017), టోంబ్ రాబర్ (2014), ది మంకీ కింగ్ 2 (2016) వంటి చిత్రాలలో చేసిన చైనీస్ నటి. ఆమె ము ఖిమియా.[1]
జీవిత చరిత్ర
[మార్చు]మియా ముఖి 14 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ చేయడం ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె ప్రొఫెషనల్ యోగా శిక్షకురాలుగా స్థిరపడింది. మైఖేల్ టోంగ్ నటించిన టోంబ్ రాబర్ (2014)లో ఆమె తన నటనా వృత్తిని ప్రారంభించింది.
ఆమె అత్యంత అందమైన ఆసియా యోగా కోచ్ గా ప్రశంసలు అందుకోవడంతో పాటు, టెన్సెంట్ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ ఆటో షో 2010లో "ఫేవరేట్ లేడీ" అవార్డును గెలుచుకుంది.
ఆమె యోగా, డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండటమే కాకుండా కొరియన్ యుద్ధకళ టైక్వాండో టీచర్ కూడా. జాకీ చాన్, కుంగ్ ఫూ యోగా (Kung Fu Yoga) ఇతర తారాగణంతో పాటు, ఆమె సినిమాను ప్రమోట్ చేయడానికి ది కపిల్ శర్మ షోలో పాల్గొన్నది.[2]
యోగా ప్రమోషన్ అంబాసిడర్
[మార్చు]యునాన్ ప్రావిన్స్‌లో యోగా దేవత (Goddess of Yoga)గా పిలువబడే మియా ముఖి, 2016 చైనా (కున్మింగ్)–ఇండియా యోగా కాన్ఫరెన్స్‌కు యోగా ప్రచార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.[3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | టైటిల్ | ఇంగ్లీష్ టైటిల్ | చైనీస్ టైలిల్ | పాత్ర | నోట్స్ |
---|---|---|---|---|---|
2014 | టోంబ్ రాబర్ | Tomb Robber | 密道追踪之阴兵虎符 | యాన్ ఎర్ | |
2016 | ది మంకీ కింగ్ 2 | The Monkey King 2 | 西游记之孙悟空三打白骨精 | పిగ్ మాన్స్టర్ | |
2017 | కుంగ్ ఫూ యోగా | Kung Fu Yoga | 功夫瑜伽 | నౌమిన్ | |
2018 | ది ప్లూటో మూమెంట్ | The Pluto Moment | 冥王星时刻 | గావో లి | |
ది యూనిటి ఆఫ్ హీరోస్ 2 | The Unity of Heroes 2 | 黄飞鸿之怒海雄风 | కవాషిమా యుకికీ | ||
2020 | వాన్గార్డ్ | Vanguard | 急先锋 | మి యా | |
2021 | లడ్కీ: డ్రాగన్ గర్ల్ | Ladki: Dragon Girl | మి యా | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ "KUNG FU YOGA MOVIE REVIEW: KUNG-FOOLED". Archived from the original on 4 February 2017. Retrieved 4 February 2017.
- ↑ "Asian queen of Yoga - Muqi Miya". Archived from the original on 13 February 2017. Retrieved 12 Feb 2017.
- ↑ "Muqi Miya as Yoga promotion ambassador". Archived from the original on 28 September 2016. Retrieved 12 Feb 2017.