మిరాన్ బక్ష్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాలిక్ మిరాన్ బక్ష్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రావల్పిండి, బ్రిటిష్ ఇండియా | 1907 ఏప్రిల్ 20|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1991 ఫిబ్రవరి 8 రావల్పిండి, బ్రిటిష్ ఇండియా | (వయసు 83)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 21) | 1955 జనవరి 29 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1955 ఫిబ్రవరి 13 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2020 ఏప్రిల్ 13 |
మాలిక్ మిరాన్ బక్ష్ (1907, ఏప్రిల్ 20 - 1991, ఫిబ్రవరి 8), పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1955లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇతనిని మిరాన్ బక్స్ అని కూడా పిలుస్తారు.
ప్రారంభ జీవితం, కుటుంబం
[మార్చు]మీరాన్ బక్ష్ 1907 ఏప్రిల్ 20న బ్రిటిష్ ఇండియాలోని రావల్పిండిలో జన్మించాడు. ఇతని తండ్రి పిండి క్లబ్ గ్రౌండ్‌లో గ్రౌండ్స్‌మెన్ గా పనిచేశాడు.[1]
క్రికెట్ రంగం
[మార్చు]1950లో 43 ఏళ్ళ వయసులో కమాండర్-ఇన్-చీఫ్స్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.[1] ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ముందు వెస్టిండీస్, కామన్వెల్త్ క్రికెట్ జట్టుతో రెండు రోజుల మ్యాచ్‌లలో ఆడాడు.[1]
47 సంవత్సరాల 284 రోజుల వయస్సులో లాహోర్‌లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో టెస్టు అరంగేట్రం చేసాడు.[2] ఇది ఇతని రెండవ ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ మాత్రమే.[1]
ఇతను పొడవాటి ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. 1948/49లో పర్యాటక వెస్టిండీస్‌తో జరిగిన రెండు-రోజుల మ్యాచ్‌లో ఐదు వికెట్లు, 1949/50లో కామన్వెల్త్ XI తో జరిగిన మరో రెండు-రోజుల మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు.[3] సంక్షిప్త టెస్ట్ కెరీర్ ముగిసిన తర్వాత, 1958/59 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు. 51 సంవత్సరాల వయస్సులో తన చివరి మ్యాచ్‌లో రావల్పిండి తరపున పెషావర్‌తో ఆడిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.[4] 1956/57లో ఢాకాలో కంబైన్డ్ సర్వీసెస్ కోసం జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు వచ్చాయి. 15 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. ఈస్ట్ పాకిస్తాన్ వైట్స్‌ను 33 పరుగుల వద్ద అవుట్ చేయడంలో సహాయం చేశాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Baptism by fire: Fewest first-class matches before Test debut for Pakistan". The News International.
- ↑ Fantastic Mr Fox, CricInfo, 15 April 2003. Retrieved 24 April 2019.
- ↑ Wisden 1992, pp. 1263-1264.
- ↑ Rawalpindi v Peshawar 1958–59, CricketArchive. Retrieved 13 April 2020. (subscription required)
- ↑ Miran Bakhsh, CricketArchive. Retrieved 13 April 2020. (subscription required)
- ↑ East Pakistan Whites v Combined Services 1956–57, CricketArchive. Retrieved 13 April 2020. (subscription required)