మిషన్ కర్మయోగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ సివిల్ సర్వీసుల ( ఐఏఎస్, ఐపీఎస్ ) సిబ్బందికి సంబంధించిన శిక్షణ, ఇతర రకాల సహాయం అందించేందుకు ' మిషన్ కర్మయోగి ' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేసింది[1]. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసులలో సంస్థగతంగా వివిధ సంస్కరణల ద్వారా సిబ్బంది, అధికారులు వారి సామర్ధ్యాలు, నైపుణ్యాలు పెంపొందించడం, వాటిని పూర్తిగా రూపాంతరం చేయడం మొదలైన వాటికి మిషన్ కర్మయోగి కృషి చేస్తుంది[2]. భారత సివిల్ సర్వీసుల సిబ్బంది భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉండేలా, మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, ఆవిష్కరణత్మకంగా, చురుకుగా పనిచేసేందుకు ; వృత్తిపరంగా, ప్రగతిశీలంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా, సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకొని పనిచేసేందుకు ఇది సహాయపడుతుంది[3]. ప్రజల భాగస్వామ్య స్పృహతో జాతీయ ప్రాధాన్యతతో భవిష్యత్తు సాంకేతికతను సేవల వితరణ చేసే విధంగా సివిల్ సర్వీసులను తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. ఐ గాట్ కర్మయోగి వేదికగా ఆన్లైన్ శిక్షణ అందిస్తుంది[4].

మూలాలు :

  1. "మిషన్ కర్మయోగి: సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం". Samayam Telugu. Retrieved 2023-09-07.
  2. "రక్షణకు వాత్సల్య... శిక్షణకు కర్మయోగి". EENADU. Retrieved 2023-09-07.
  3. "Mission Karmayogi: మిషన్ కర్మయోగి శిక్షణా పథకం.. సివిల్ సర్వెంట్లకు కొత్త ఆదేశాలు." News18 Telugu. 2023-08-02. Retrieved 2023-09-07.
  4. "Karmayogi Bharat". igotkarmayogi.gov.in. Retrieved 2023-09-07.