Jump to content

మిషిమా యుకియో(1925-1970)

వికీపీడియా నుండి

మిషిమా యుకియో
三島由紀夫
మిషిమా 1956 లో
జననం
Kimitake Hiraoka

మూస:జన్మ తేదీ = నాగాజుమీ-cho 2-chome, Yotsuya-ku, Tokyo City, Tokyo Prefecture, Empire of Japan
(Current: Yotsuya 4-chome, Shinjuku-ku, Tokyo, Japan)
సమాధి స్థలంTama Cemetery, Tokyo
విద్యాసంస్థFaculty of Law, University of Tokyo
గుర్తించదగిన సేవలు
Confessions of a Mask, The Temple of the Golden Pavilion, The Sea of Fertility
Japanese name
కంజీ三島 由紀夫
హిరగానాみしま ゆきお
కటాకనాミシマ ユキオ
Japanese name
కంజీ平岡 公威
హిరగానాひらおか きみたけ
కటాకనాヒラオカ キミタケ
సంతకం

మిషిమా, యుకియో1925-70:

[మార్చు]

ప్రసిద్ధ జపానీస్ రచయిత అసలు పేరు ’హిరవోకా కిమిటకే’ 1925 జనవరి 14న టోక్యోలో జన్మించాడు. ఇతడు మిషిమా యుకీయో అనే కలం పేరుతో ప్రసిద్ధి పొందాడు. జపానీయుల సాంప్రదాయక జీవన విలువలకు పాశ్చాత్య నాగరికత ప్రభావానికి మధ్య ఏర్పడిన స్పర్ధ మిషిమా యుకియో రచనలలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈస్పర్ధను మిషిమా యుకియో నిజ జీవితంలో అతి విషాదకరంగా ఆత్మహత్యల రూపంలో పరిష్కరించాడు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి కుమారుడైన ’మిషిమా’ టోక్యోలోని అరిస్టోక్రటిక్‌ పేర్స్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా సైన్యంలో లో చేరాలని ఉవ్విళ్ళూరినా శరీరపు కొలతలు సరిపోని కారణంగా చేయలేకపోయాడు. టోక్యోలోని ఒక కర్మాగారంలో పని చేస్తూ యుద్ధం పూర్తయిన తరువాత టోక్యో విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. 1948-49 లో జపాన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ లోని బ్యాంకింగ్ ఈ విభాగంలో చేరాడు.[1]

కామన్ నో కోకుహాకు(1949)

[మార్చు]

ఇతని తొలి నవల ఇందులో కొంత వరకు తన స్వీయ అనుభవాలను గ్రంథస్థం చేసాడు. ఈ నవలలో స్వలింగ సంపర్కం ప్రధాన కథాంశంగా ఉంది. అతడు వ్రాసిన అనేక ఇతర రచనలలో కూడా ఇది ఇది కనిపిస్తుంది. ఈ నవల అతనికి వెంటనే ఆర్జించి పెట్టడంతో ’మిషిమా’ రచన రంగం పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాడు. ’మిషిమా”  రచనలలో రక్తపాతం, మరణం, ఆత్మహత్య, ఆధునిక జీవనపు నిరాసక్తత  పట్ల వ్యతిరేకత ధ్వనిస్తూ ఉంటాయి.  అతని తొలి దశలోని రచనలలో భౌతిక, మానసిక సమస్యలతో  సతమతమయ్యే పాశ్చాత్య  ప్రతినాయకులు  దర్శనమిస్తారు.  మలిదశలో ని రచనలలో జపాన్ సంప్రదాయ సాహిత్యపు  రీతిలో గుణవంతులైన  నాయకులు కనిపిస్తారు.

 కింకా కూజి(The Temple of Golden Pavilion:1956) 

[మార్చు]

యువకుడైన ఒక బౌద్ధాలయం సేవకుడు తన ప్రార్థనా మందిరం సౌందర్యానికి ముగ్ధుడై దానిని తగులబెట్టిన సంఘటన వర్ణించబడింది. టాయియో టో టెట్సు)(1968,Sun and Steel) లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పొందిన ఓటమి వల్ల కలిగిన సిగ్గును శారీరక బలాన్ని పెంపొందించుకోవాలసిన  ఆవశ్యకతను వివరించాడు.  పై రెండు రచనలలో కూడా మరణాన్ని కూర్చిన వ్యాఖ్యానాలు ఉన్నాయి.  అతని చివరి రచన హోజో నో ఉమి(1965- 70) Sea of Fertility)  అనే నాలుగు భాగాల ఐతిహాసిక రచనలు చంద్రునిలోని ఎడారి లాంటి సీ ఆఫ్‌ పెర్టిలిటీ తో ఆధునిక జపాన్ దేశాన్ని పోల్చాడు ఈ గ్రంథంలో హోరు  నో  యుకీ(Spring Snow),హోమ్మా (Runaway Horses), ఆకట్సుకి నోటెరా(The Temple of Dawan), టెన్నిస్‌ గోషుయి(The Decay of the Angel)అనే  నాలుగు భాగాలున్నాయి.  ’మిషిమా’ వ్రాసిన డెత్‌ ఇన్‌ మిడ్‌ సమ్మర్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌(1966) లోని దేశభక్తి ఆధారంగా యుకియో అనే చలన చిత్రాన్ని నిర్మించారు. మిషిమా  దర్శకత్వం వహించి నటించిన  ఈ చిత్రంలో జపాన్ దేశపు కర్మకాండ తో కూడిన  ’సెప్పుకు’(Seppuku)  ఆత్మహత్య విధానాన్ని చూపించారు.  చిత్రాలకు చేసిన రచనలే కాకుండా జపాన్ సంప్రదాయానుసారంగా అనేక నాటక కళా రూపాలను కూడా మిషిమా  సృష్టించాడు.  సాంస్కృతికంగా మతపరంగా ప్రాక్పశ్చిమాల  కలయిక ’మిషిమా’  నాటకాల్లో కనిపిస్తుంది. సమకాలీన పాశ్చాత్య నాగరికత ప్రభావిత జపాన్ జీవన విలువలకు గతకాలపు ’సమురాయి’ సైనిక రాజ్య  సంప్రదాయ విలువలకు మధ్య ’మిషిమా’  మానసికంగా  నలిగిపోయాడు.   వ్యక్తిగతంగా ’మిషిమా’ పాశ్చత్య నాగరికతను జీవన విధానాన్ని అవలంబించాడు.అతనికి పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన విజ్ఞానం ఉంది అయినా గుడ్డిగా అనుకరించటాన్ని ’మిషిమా’ తీవ్రంగా ఖండించాడు. ’మిషిమా’  జపాన్ దేశపు యుద్ధ కళలైనా  కరాటే మొదలైన విద్యలను అభివృద్ధి పరచి వివాదస్పదమైన ’టాటేనోయ్‌’ Shield Society) అనే సైన్య దళాన్ని ఏర్పరచాడు కమ్యూనిటీ లేదా వామపక్ష సైన్యాలు తమ దేశంపై దాడి చేసినప్పుడు ఈ దళాలు తమ సైనిక దళాలకు సహాయ పడగలవని ’మిషిమా’ ఆశించాడు.  గౌరవప్రదమైన ఆమోద పూర్వకమైన  ఆత్మహత్య పై గల నమ్మకాన్ని ’మిషిమా’  తన ఆత్మహత్యతో రుజువు పరచాడు 1970 నవంబర్ 25న నలుగురు ’టాటో నో కాయ్‌’   అనుచరులు వెంటరాగా టోక్యోలోని మిలిటరీ కేంద్ర స్థానంలో ఉన్న కమాండ్ జనరల్ కార్యాలయాన్ని స్వాధీనపరచుకొని పదినిమిషాల పాటు అక్కడ గుమి గూడిన  1000 మంది సైనికుల ముందు ఉపన్యసించాడు.  తన ఉపన్యాసంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం జపన్‌ దేశ రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించాడు. తరువాత తన కత్తితో ప్రేగులను చీల్చుకుని ’సెప్పుకు’  పద్ధతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని  అనుచరుడొకడు  అతని తలను ఖండించి మరణయాతన అనుభవిస్తున్న’మిషిమా’కు ’సెప్పు’కు పద్ధతిలో విముక్తి కల్గించాడు.

మూలాలు

[మార్చు]
  1. విజ్ఞాన సర్వస్వం- విశ్వసాహితి-సంపుటం-5. హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1994. p. 830. ISBN 81-86073-09-4.