మిస్సోరి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిస్సోరి నది (Missouri River - మిస్సౌరీ రివర్) అనేది ఉత్తర అమెరికాలో అతిపొడవైన నది. పశ్చిమ మోంటానా యొక్క రాకీ పర్వతాలలో ఉద్భవించిన ఈ మిస్సౌరీ నది సెయింట్ లూయిస్ నగరానికి ఉత్తరమున మిసిసిపి నదిలోకి ప్రవేశించే ముందు 2,341 మైళ్లు (3,767 కి.మీ.) తూర్పు, దక్షిణ దిక్కులవైపుగా ప్రవహిస్తుంది. ఈ నది ఐదు లక్షలకు పైగా చదరపు మైళ్లలో తక్కువ జనసంఖ్య కల ప్రాంతాల, పాక్షిక శుష్క పరీవాహకల నుండి నీటిని తీసుకుంటుంది, ఇది పది యు.ఎస్ రాష్ట్రాలు, రెండు కెనడియన్ ప్రాంతాల భాగాలను కలిగి ఉంది. దిగువనున్న మిసిసిపి నదితో కలుపుకుంటే, ఇది ప్రపంచంలో నాలుగో అతి పొడవైన నది వ్యవస్థ అవుతుంది.