మీనాక్షి థాపర్
మీనాక్షి థాపర్ | |
---|---|
జననం | 1984 అక్టోబరు 4 |
మరణం | 2012 ఏప్రిల్ 19 | (వయసు 27)
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | మీనాక్షి థాపా |
వృత్తి | నటి |
మీనాక్షి థాపర్ (1984 అక్టోబరు 4 - 2012 ఏప్రిల్ 19) హిందీ చిత్రసీమలో పనిచేసిన భారతీయ నటి. ఆమె డెహ్రాడూన్‌లో జన్మించింది. ఆమె 2011లో హారర్ చిత్రం 404లో తొలిసారిగా నటించింది. ఆ తరువాత ఆమె (పకౌ) చిత్రంలో నటించింది.
కిడ్నాప్, హత్య
[మార్చు]ఏప్రిల్ 2012లో, హీరోయిన్ సినిమా చిత్రీకరణ సమయంలో, ఆమె తన కుటుంబ సంపద గురించి మాట్లాడటం విన్న సహ నటుడు అమిత్ జైస్వాల్, అతని స్నేహితురాలు ప్రీతి సూరిన్‌లు ఆమెను కిడ్నాప్ చేశారు.[1] ఆమెను వదలడానికి ₹1.5 మిలియన్ల (సుమారు US$29,000) డబ్బు కోసం పట్టుబట్టారు. తమ డిమాండ్ నెవేర్చకపోతే, ఆమెను బలవంతంగా అశ్లీల చిత్రాలలో నటింపచేస్తామని కిడ్నాపర్లు ఆమె తల్లికి చెప్పారు. ఆమె తల్లి ₹60,000 చెల్లించింది.[2] అయినా, గోరఖ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో మీనాక్షి థాపర్ ని గొంతు కోసి వారు చంపేసారు.[3] ఆమె మొండెం వాటర్ ట్యాంక్‌లో వదిలేసి, తలను ముంబైకి వెళ్లే మార్గంలో బస్సు నుండి విసిరివేసారు.[4] ఆమె మొబైల్ ఫోన్‌లోని సిమ్‌కార్డు సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోగా నేరాన్ని అంగీకరించారు.[5]
అనంతర పరిణామాలు
[మార్చు]2018 మే 9న, మీనాక్షి థాపర్ అపహరణ, హత్య కేసులో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను దక్షిణ ముంబైలోని సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ తరువాత, అమిత్ జైస్వాల్ (36), అతని స్నేహితురాలు ప్రీతి సూరిన్ (26)లకు ముంబై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.[6] అయితే, శిక్షపై వాదనల సందర్భంగా,దోషులు ఇద్దరికీ మరణశిక్ష విధించాలని కూడా వాదన వచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ "Bollywood Actress Meenakshi Thapar Beheaded By Costars After Denying $28,655 Ransom, 'Her Body Was Hacked Into Pieces'". Ib Times. 19 April 2012. Retrieved 19 April 2012.
- ↑ "Bollywood actress kidnapped and beheaded by actors". The Daily Telegraph. 19 April 2012. Retrieved 19 April 2012.
- ↑ "Bollywood actress's head still missing after ransom demands not reached". National Post. 19 April 2012. Retrieved 19 April 2012.
- ↑ "Bollywood actress Meenakshi Thapar killed by co-stars". Daily News. New York. 19 April 2012. Retrieved 19 April 2012.
- ↑ "Nepalese starlet abducted, killed; Mumbai Police arrest 2 junior artists". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-01-20.
- ↑ "2 get life sentence in actress Meenakshi Thapa's murder in 2012 - India Today". web.archive.org. 2024-01-22. Archived from the original on 2024-01-22. Retrieved 2024-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)