మీనాక్షి పొన్నుదురై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మీనాక్షీ పొన్నుదురై ( - 2001) శ్రీలంకకు చెందిన తమిళ రచయిత్రి, రేడియో సిలోన్‌లో పనిచేసిన అనౌన్సరు. ఆవిడ తెలుగు కార్యక్రమాలను కూడ నిర్వహించేవారు. ఆ కార్యక్రమాలు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేవి. ఆవిడకు వేలకొలది అభిమానులు తెలుగువారిలో ఉండేవారు. 1960లలో నుండి 1980ల వరకు ఆవిడ తన గళంతో తెలుగు ప్రజలను అలరించారు. వేదాంత కథలతో బాగా పరిచయమున్న మీనాక్షి యాగాలు, యజ్ఞాల గురించి వివరిస్తూ శ్రోతులను శ్రద్ధగా వినేట్లు ఆకట్టుకొనేది. ఈమె రేడియోలో పనిచేయటమే కాకుండా భక్తి విషయాలపై ఆంగ్లంలో అనేక రచనలు కూడా చేసింది.[1]

2001 జూలై 21న శ్రీలంక బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ లో స్టూడియో 9లో మరుసటి రోజు తను తమిళ సినీ దిగ్గజం శివాజీ గణేషన్ గూర్చి మాట్లాడబోతుందని శ్రోతలకు గుర్తుచేసి శెలవుతీసుకొంది. కానీ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఆమె తన చివరి శ్వాస వదిలింది. మరణించే నాటికి ఆమె వయసు దాదాపు 75 ఏళ్లు.[2]

మూలాలు[మార్చు]