మీనాక్షి శిరోద్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనాక్షి శిరోద్కర్
బ్రహ్మచారి (1938 చిత్రం) లో మీనాక్షి శిరోద్కర్ ధరించిన ఈతదుస్తులు
బ్రహ్మచారి (1938 చిత్రం) లో మీనాక్షి శిరోద్కర్
మాతృభాషలో పేరుమరాఠీ: मीनाक्षी शिरोडकर
జననంరతన్ పెడ్నెకర్
(1916-10-11) 1916 అక్టోబరు 11
మరణం1997 జూన్ 3 (1997-06-03)(వయసు 80)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
ప్రసిద్ధులుబ్రహ్మచారి (1938 చిత్రం)
బంధువులునమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ (మనవరాళ్ళు)

మీనాక్షి శిరోద్కర్ (అక్టోబరు 11, 1916 - జూన్ 3, 1997) ఒక భారతీయ నటి, ప్రధానంగా మరాఠీ సినిమాలలో, మరాఠీ రంగస్థలాలపై, టెలివిజన్లో పనిచేశారు. 1938లో రంగప్రవేశం చేసిన ఈమె 1970ల వరకు చలన చిత్రాల్లో నటిస్తూనే ఉంది. మాస్టర్ వినాయక్ తో మరాఠీ చిత్రం బ్రహ్మచారి (1938) లో ఒక స్విమ్ సూట్ లో ఇచ్చిన తన ప్రదర్శనకు అప్పటి సంప్రదాయ ప్రేక్షకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈమె బాలీవుడ్ నటీమణులు నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ లకు బామ్మ.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మహారాష్ట్ర కుటుంబంలో అక్టోబరు 11, 1916న జన్మించిన మీనాక్షి శిరోద్కర్ కు అప్పుడు రతన్ పెడ్నెకర్ అని పేరు. ఈమె చిన్న వయసులోనే భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. 1936లో డాక్టర్ శిరోద్కర్ తో వివాహమైంది, వీరికి ఒక పుత్రుడు కలిగాడు. బాలీవుడ్ నటీమణులైన ఈమె మనవరాళ్ళు నమ్రతా శిరోద్కర్, శిల్పా శిరోద్కర్ కూడా చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. 1993లో నమ్రత మిస్ ఇండియాగా ఎంపికయ్యింది. జూన్ 4, 1997 న మీనాక్షి శిరోద్కర్ ముంబైలో 80 సంవత్సరాల వయసులో మరణించింది.