మీ ఆయన జాగ్రత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీ ఆయన జాగ్రత్త
(1998 తెలుగు సినిమా)
Mee Aayana Jagratha.jpg
దర్శకత్వం ముత్యాల రామదాసు
నిర్మాణం ఉషారాణి, సి కళ్యాణ్ (సమర్పణ)
కథ వల్లభనేని జనార్దన్
చిత్రానువాదం వల్లభనేని జనార్దన్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రోజా, బ్రహ్మానందం
సంగీతం కోటి, వినాయకరావు
సంభాషణలు శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
ఛాయాగ్రహణం ఎన్.వి.సురేష్ కుమార్
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మీ ఆయన జాగ్రత్త 1998 లో విడుదలైన కామెడీ చిత్రం. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉషా రాణి సి.కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలలో నటించగా కోటి, వినాయక్ రావు స్వరపరిచారు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.[1] ఈ చిత్రం 1975 తమిళ చిత్రం యారుక్కు మాపిల్లై యారోకు కొంత అనుసరణ.

కథ[మార్చు]

మిలిటరీ మేజర్ (వల్లభనేని జనార్ధన్) నేతృత్వంలోని కంపెనీలో ఉద్యోగం సంపాదించిన గోపి కృష్ణ (రాజేంద్ర ప్రసాద్) పై ఈ చిత్రం ప్రారంభమవుతుంది. మేజర్ ఏకైక కుమార్తె సుందరి (రోజా) అతన్ని ప్రేమిస్తుంది. పెళ్ళి చేసుకుంటుంది. కాని ఆమె శోభనం చేసుకోడానికి కొంత సమయం అడుగుతుంది. ఆ సమయంలో గోపి ఒక వేశ్య, రక్ష (రక్ష) వైపు ఆకర్షితుడవుతాడు. తన సన్నిహితుడైన బోసు (శివాజీ రాజా) కు అబద్ధం చెప్పి, రక్షతో గడిపేందుకు అతడి ఇంటిని తీసుకుంటాడు. దురదృష్టవశాత్తు, సుందరి ఆ స్థలానికి వస్తుంది. అసలు సంగతిని కప్పిపుచ్చడానికి, గోపి రక్షను బోసు భార్యగా పరిచయం చేస్తాడు. కొన్ని హాస్య సంఘటనల తరువాత, బోసు తన ప్రేయసి లత (లతా శ్రీ) ను పెళ్ళి చేసుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా లత, రక్షను గోపి భార్యగా అనుకుంటుంది. ఇక్కడ, బోసు లత కలిసి ఉండడం చూసి, సుందరి తప్పుగా అర్థం చేసుకుంటుంది. సుందరిని, గోపీని చూసి లత కూడా అలాగే అనుకుంటుంది. గోపి ఈ సమస్యల నుండి ఎలా బయటపడతాడనేది మిగతా కథ

నటీనటులు[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

 • కళ: బాబ్జీ
 • నృత్యాలు: తారా, శివ-సుబ్రమణ్యం, ప్రేమ-నాగరాజు
 • పోరాటాలు: రాములు
 • సంభాషణలు: శ్రీ అమ్ముల్య ఆర్ట్స్ యూనిట్
 • సాహిత్యం: సమావేదం షణ్ముఖ శర్మ, సాహితి, అనిల్ నరేంద్ర
 • నేపథ్య గానం: ఎస్పీ బాలు, చిత్ర, మనో, సునీత
 • సంగీతం: కోటి, వినాయక్ రావు
 • కూర్పు: కె. రమేష్
 • ఛాయాగ్రహణం: ఎన్.వి.సురేష్ కుమార్
 • ప్రెజెంటర్: సి.కళ్యాణ్
 • నిర్మాత: ఉషా రాణి
 • కథ- చిత్రానువాదం - దర్శకుడు పర్యవేక్షణ: వల్లభనేని జనార్ధన్
 • దర్శకుడు: ముత్యల రమదాస్
 • బ్యానర్: శ్రీ అమ్ముల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
 • విడుదల తేదీ: 1998

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "జాబిలమ్మ"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 3:58
2. "వానా వానా"  మనో, సునీత 3:47
3. "నా హోలీ రంగేళీ"  మనీ, చిత్ర 4:20
4. "అందం దెబ్బ కొట్టిందే"  మనో, సునీత 4:04
5. "టైటు జీన్స్ వేసి"  మనో, సునీత 4:24
మొత్తం నిడివి:
20:23

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Error on call to మూస:cite web: Parameters url and title must be specified