Jump to content

ముఖ్య గమనిక

వికీపీడియా నుండి
ముఖ్య గమనిక
దర్శకత్వంవేణు మురళీధర్ వడ్నాల
రచనవేణు మురళీధర్ వడ్నాల
నిర్మాతరాజశేఖర్ లోకం
సాయి కృష్ణ లోకం
తారాగణం
  • విరాన్ ముత్తంశెట్టి
  • లావణ్య సాహుకార
ఛాయాగ్రహణంవేణు మురళీధర్ వడ్నాల
కూర్పుశివ సర్వాణి
సంగీతంకిరణ్ వెన్నా
నిర్మాణ
సంస్థ
శివిన్ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
సినిమా నిడివి
125 minutes
దేశంభారతదేశం
భాషతెలుగు

ముఖ్య గమనిక 2024లో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా.[1] శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై రాజశేఖర్, సాయి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వేణు మురళీధర్. వి దర్శకత్వం వహించాడు. విరాన్ ముత్తంశెట్టి, లావణ్య, ఆర్యన్ ఇప్పిల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేయగా,[2] ట్రైలర్‌నును ఫిబ్రవరి 2న విడుదల చేసి, ఫిబ్రవరి 23న సినిమా విడుదలైంది.[3]

విరాన్ (విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. విరాన్ తండ్రిలాగే చాలా మంది పోలీసులు ఇదే విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ అనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి ? చివరికి విరాన్ ఆ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాడా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."ఆ కన్నుల చూపుల్లోనా"నకాష్ అజీజ్ , రేవతి శ్రీత4:42
మొత్తం నిడివి:4:42

మూలాలు

[మార్చు]
  1. NT News (7 January 2024). "థ్రిల్లర్‌ కథతో ముఖ్య గమనిక". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  2. Sakshi (27 May 2024). "ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్‌ అనిపిస్తోంది". Archived from the original on 27 May 2024. Retrieved 29 November 2024.
  3. V6 Velugu (21 February 2024). "ముఖ్య గమనిక మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్". Archived from the original on 25 April 2024. Retrieved 29 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (234 February 2024). "'ముఖ్య గమనిక' సినిమా రివ్యూ". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024. {{cite news}}: Check date values in: |date= (help)
  5. "Mukhya Gamanika Review: Viran Muttamsetty-starrer An Engaging Crime Thriller". News18. 24 February 2024. Archived from the original on 12 March 2024. Retrieved 29 September 2024.

బయటి లింకులు

[మార్చు]