Jump to content

మునిమాణిక్యం నాటికలు

వికీపీడియా నుండి

మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఇవి ఆయన రచించిన హాస్య ప్రధానమైన రేడియో నాటికలు.

రచయిత

[మార్చు]

మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది. తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు.

ఇందులో

[మార్చు]

మొదటి భాగం

[మార్చు]
  • కరువురోజుల్లో కాంతమ్మ ఇంట్లో
  • బ్రహ్మరాక్షసి
  • రాజబందీ
  • మూటలదొంగ
  • విదూషకుడు

రెండవ భాగం

[మార్చు]
  • జయమ్మ కాపురం
  • ఎలోప్‌మెంటు

మూలాలు

[మార్చు]