మునిమాణిక్యం నరసింహారావు
![]() | |
జననం | మార్చి 15, 1898 తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి |
మరణం | ఫిబ్రవరి 4, 1973 |
వృత్తి | కథకుడు, |
జీవిత భాగస్వామి | కాంతం రాజ్యలక్ష్మి |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు |
తల్లిదండ్రులు |
|
మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.
జీవిత విశేషాలు[మార్చు]
మునిమాణిక్యం నరసింహారావు తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈయన తెనాలిలో ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే కొండా వెంకటప్పయ్య గారి ఆయన సహాయం వల్ల బి.ఎ చదివారు.ఆయన భార్య కాంతం.[1] ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణిలో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది. ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా చేసుకున్నారు.
తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు. ఆయన కుమారుడు మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య కూడా రచయితగా రాణించాడు.
రచనలు[మార్చు]
- కాంతం కథలు - తెలుగు కథాసాహిత్యంలో ఒక మణిపూస
- అప్పులు చేయడం - తీర్చడం - అప్పు చేసిన మొత్తమును తిరిగి ఇచ్చేవాడు అధముడు. కాలం గడిపేవాడు మధ్యముడు. తెచ్చిన మరుక్షణములో ఆవిషయం సులువుగా మరవగలిగినవాడు ఉత్తముడు.
- దాంపత్యోపనిషత్తు
- గృహప్రవేశం
- హాస్య కుసుమావళి
- మాణిక్య వచనావళి
- స్తుతి - ఆత్మ స్తుతి
- తెలుగు హాస్యం
- హాస్య ప్రసంగాలు
- రుక్కుతల్లి
- జానకీ శర్మ
- యథార్థ దృశ్యాలు
- మంచివాళ్ళు మాట తీరు
- తగూ నెంబరు త్రీ ఇతర కథలు
- ఇల్లు, ఇల్లాలు
- కాంతం వృద్ధాప్యము
- దాంపత్యజీవితము
- కాంతం కైఫీయతు
మూలాలు[మార్చు]
- అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991
- మునిమాణిక్యం నరసింహారావు రచనలు (DLI ఆర్కైవ్.ఆర్గ్ లో)
- http://www.prabhanews.com/sundayspecial/article-36179[permanent dead link]
బయటి లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలుగు రచయితలు
- తెలుగు కథా రచయితలు
- 1898 జననాలు
- 1973 మరణాలు
- హాస్య రచయితలు
- గుంటూరు జిల్లా రచయితలు