మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య
స్వరూపం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య మురయా అనే కలంపేరుతో సుప్రసిద్ధుడు. ఇతడు ప్రముఖ హాస్యరచయిత మునిమాణిక్యం నరసింహారావు కుమారుడు. ఇతడు సమాచార ప్రసార మంత్రిత్వశాఖలో ఫిలిం పబ్లిసిటీ ఆఫీసర్‌గా పనిచేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు కథలు, నవలలు రచించాడు. ఇతని రచనలు ఆంధ్రప్రభ, పుస్తకం, సాహితి, తరుణ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రజనత, భారతి, జయంతి, ఆనందవాణి, యువ, చుక్కాని, విశ్వరచన, ఆంధ్రపత్రిక తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
కథలు
[మార్చు]- అంతులేని ఆలోచనలు
- అతనికంటె ఘనుడు
- అదృష్టవంతుడు
- అమ్మరాలేదు
- అస్థిరుడు
- ఆత్మార్పణం
- ఇద్దరు భయస్తులు
- ఇహం పరం
- ఉపాయం
- కలసి వచ్చిన నా కారు
- గాలిగోపురం
- చేతికఱ్ఱ
- జన్మహక్కు
- జీవితంలో మలుపు
- తనదాకా వస్తే
- దగాలో దర్జా
- దాగిన సత్యం
- దోంగనోట్లు
- ధ్వనిచిత్రం
- నమ్మకస్తుడు
- నిత్యమల్లి
- పంకజం
- పండుగనాడు
- పండుగనేర్పిన పాఠం
- పగ అడగించుటెంతయు శుభంబు
- పడుచులతో పరిచయం
- పరిణామం
- పెళ్ళి కూతురు
- పోయిన సొమ్ము
- ప్రతిఫలం
- ప్రయివేటు మరణం
- ప్రవాసము
- భయస్తుడు
- మమత
- ముడిపడిన... 1
- రసభంగం
- వారసుడు
- వ్యర్థత్యాగం
- సంస్కారం
- సమర్ధుడు
- సాధన
- సిల్కు చీర
- స్వాధీన మృత్యువు
కథాసంపుటాలు
[మార్చు]- ఇహంపరం
- నిత్యమల్లి[1]
- పంకజం
- మంచిమనిషి
- సిల్కుచీర
నవలలు
[మార్చు]- వీధిమనుషులు
- చిత్రకారుడిభార్య