Jump to content

ముప్పిరాల వెంకట నారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
దస్త్రం:Sanyasi muppirala venkatanarayana sastri.jpg

ముప్పిరాల వెంకట నారాయణ శాస్త్రి స్వస్థలం నెల్లూరు జిల్లా పాములవారి పాలెం. ఈయన 1909 లో జన్మిచాడు. తల్లి శేషమ్మ, తండ్రి సుబ్బయ్య. నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో భాషాప్రవీణ,వ్యాకరణ విద్యాప్రవీణ పరీక్షలో కృతార్థులై కొద్దికాలం నెల్లూరు సమీపంలోని కోవూరు మునిసిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా చేసి, నెల్లూరు సెయింట్ పీటర్స్ హైస్కూల్లో 1950 నుంచి 1968 వరకు తెలుగు పండితులుగా చేశాడు. వేద సంస్కృత పాఠశాలలో గాజులపల్లి హనుమచ్ఛాస్త్రి వంటి ఉద్దండ పండితులవద్ద చదివే అదృష్టం ఈయనకు కలిగింది. పుష్పగిరి వెంకటకృష్ణయ్య, స్వయంపాకుల వెంకట రమణ శర్మ వంటి గొప్ప పండితులు ఈయన సహ విద్యార్థులు. ఈయన భాష్యాంతం వ్యాకరణం, ప్రస్థాన త్రయం అధ్యయనం చేసినా చాలా నిరాడంబరంగా, నిగర్వంగ జీవితం గడిపాడు. ఆచారపరుడయినా, సర్వమత సమానత్వ్వం, స్నేహభావం జీవన విధానంగా, తనవద్దకు వచ్చిన విద్యార్థులకు, గొప్పపండితులకు అధ్యయనమ్లొ సందేహాలను నివృత్తి చేసేవాడు. చదలువాడ జయరామశాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి వంటి ఉద్దండ పండితులు సందేహ నివృత్తికోసం ఈయనను సంప్రదించేవారు.

ఈయన నిత్యానంద స్వామివద్ద మంత్రొపదేశం చేసుకొని, ఆయన ఆదేశం ప్రకారం నెల్లూరు పప్పుల వీధిలొని సంస్కృత పాఠశాలలో 40 సంవత్సరాల పాటు విద్యార్థులకు, సంస్కృతం, తెలుగు,శాస్త్రగ్రంథాలు బోధించాడు. మూలపేట వేద సంస్కృత పాఠశాల విద్యార్థులు రాత్రివేళల్లో ఈయన వద్ద పాఠాలు చెప్పించుకొని కృతార్థులై ఉద్యొగాలు సంపాదిచుకొన్నారు. ఈయనవద్ద చదువుకొన్న వారిలో మాచవొలు శ్రీరాములు, డాక్టర్ మాచవొలు శివరామప్రసాద్, నేలనూతల శ్రీనివా

సమూర్తి, తోపా అంతనారాయణ(Sri Venkateshwara Oriental Institute, Tirupati),దుర్భా సుబ్బరామయ్య మొదలయినవారు ఉన్నారు. 1991లో ఈయన నెల్లూరులోని స్వగృహంలో మరణించాడు.

మూలాలు: నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు, 2. నెల్లూరు మండల సర్వస్వం, 3.Quora లో డాక్టర్ శివరామప్రసాద్ వ్యాసం, 4. నారాయణశాస్త్రి పూర్వ విద్యార్థులు అనుభవాల కథనాలు.