మురళీ దేవరా
మురళీ దేవరా | |||
| |||
పెట్రోలియం శాఖ మంత్రి
| |||
---|---|---|---|
పదవీ కాలం 18 జనవరి 2011 – 12 జులై 2011 | |||
ముందు | మణి శంకర్ అయ్యార్ | ||
తరువాత | జైపాల్ రెడ్డి | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2002 – 2014 | |||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10 జనవరి 1937 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
మరణం | 24 నవంబర్ 2014 (వయస్సు 77) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | మిలింద్ దేవరా | ||
నివాసం | ముంబై | ||
పూర్వ విద్యార్థి | బొంబాయి యూనివర్సిటీ |
మురళీ దేవరా (10 జనవరి 1937 - 24 నవంబర్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మురళీదేవరా పారిశ్రామిక కుటుంబంలో జన్మించి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తొలిసారి ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి 1977 నుంచి 1978 వరకు ముంబై మేయర్‌గా పని చేశాడు. మురళీదేవరా ఆ తర్వాత ఆయన నాలుగు సార్లు ముంబై సౌత్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మురళీదేవరా ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడుగా 22 ఏళ్లపాటు పని చేసి 2006 యుపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మరణం
[మార్చు]మురళీ దేవరా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 నవంబర్ 24న ముంబైలోని తన స్వగృహంలో మరణించాడు.[2] ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు మిలింద్ దేవరా కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ India Today (24 November 2014). "Murli Deora: A loyalist with rapport across political spectrum" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ Sakshi (24 November 2014). "కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.