Jump to content

మురళీ శ్రీశంకర్

వికీపీడియా నుండి
ఎం. శ్రీశంకర్
కంజికోడ్ కేంద్రీయ విద్యాలయంలో శ్రీశంకర్
వ్యక్తిగత సమాచారం
జననం (1999-03-27) 1999 మార్చి 27 (వయసు 25)
పాలక్కాడ్, కేరళ, భారతదేశం
ఆల్మా మ్యాటర్కేంద్రీయ విద్యాలయం, కంజికోడ్
ప్రభుత్వ విక్టోరియా కళాశాల, పాలక్కాడ్[1]
క్రీడ
పోటీ(లు)లాంగ్ జంప్
కోచ్ఎస్. మురళి

మురళీ శ్రీశంకర్ (జననం 1999 మార్చి 27) ఒక భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్. ఆయనను సాధారణంగా ఎం. శ్రీశంకర్ అని పిలుస్తారు. ఆయన 2022 మే నెలలో లాంగ్ జంప్ ఈవెంట్ లో 8.36 మీటర్ల జాతీయ రికార్డు నెలకొల్పాడు.[2] అమెరికాలో 2022 జులై 16న (భారత కాలమానం) జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ పురుషుల లాంగ్ జంప్ అర్హత పోటీల్లో ఎనిమిది మీటర్ల దూరం దూకి నేరుగా ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ లాంగ్‌ జంప్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.[3] అయితే

ప్రారంభ జీవితం

[మార్చు]

ఎం. శ్రీశంకర్ తల్లి కె. ఎస్. బిజిమోల్, తండ్రి ఎస్. మురళి. కె. ఎస్. బిజిమోల్ 1992 ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లలో రజత పతకాన్ని గెలుచుకుంది.[4] ఎస్. మురళి మాజీ ట్రిపుల్ జంప్ అథ్లెట్, సౌత్ ఏషియన్ గేమ్స్‌లో రజత పతక విజేత కూడా. తండ్రి దగ్గరే ఎం. శ్రీశంకర్ శక్షణ పొందుతున్నాడు. నాలుగేళ్ల వయస్సులోనే స్ప్రింటర్‌గా ఎం. శ్రీశంకర్ సామర్థ్యాన్ని గుర్తించిన అతని తండ్రి తనతో పాటు అతన్ని ప్రాక్టీస్ చేయించేవాడు.[5] ఎం. శ్రీశంకర్ 50 మీటర్లు, 100 మీటర్లలో రాష్ట్ర స్థాయి అండర్-10 ఛాంపియన్ అయ్యాడు,[6] కానీ 13 సంవత్సరాల వయస్సులో స్ప్రింటింగ్ నుండి లాంగ్ జంప్‌కు మారాడు.[7] 2019 ఆగస్టు నాటికి ఎం. శ్రీశంకర్ పాలక్కాడ్‌లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.[8] అతని సోదరి శ్రీపార్వతి హెప్టాథ్లెట్.

కెరీర్

[మార్చు]

2018 మార్చిలో పాటియాలాలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఎం. శ్రీశంకర్ 7.99 మీటర్ల జంప్‌ని క్లియర్ చేశాడు.[9] అతను 2018 కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత బృందంలో పేరు పొందాడు, అయితే అపెండిసైటిస్ కారణంగా ఏప్రిల్ ఈవెంట్‌కు 10 రోజుల ముందు వైదొలగవలసి వచ్చింది.[10][11] అయినా శస్త్ర చికిత్స తరువాత ఆయన గిఫు, జపాన్ లో 2018 ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 7.47 మీటర్ల జంప్‌తో కాంస్యం గెలుచుకున్నాడు.[12] జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడలలో ఆయన ఫైనల్‌లో 7.95 మీటర్లతో ఆరవ స్థానంలో నిలిచాడు.[13] 2018 సెప్టెంబరులో భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 8.20 మీటర్ల జంప్ సాధించి జాతీయ రికార్డును ఎం. శ్రీశంకర్ బద్దలు కొట్టాడు. ఇది అండర్-20 అథ్లెట్లలో సీజన్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.[14] దోహాలో సెప్టెంబరు-అక్టోబరులో జరిగిన 2019 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.[15] 2021 మార్చిలో పాటియాలాలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఎం. శ్రీశంకర్ 8.26 మీటర్ల జంప్‌ను నమోదు చేయడం ద్వారా 2020 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు, ఇది ఒక కొత్త జాతీయ రికార్డు.[16] ఒలింపిక్స్‌లో అతను క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 7.69 మీటర్ల జంప్‌ను నమోదు చేసి, ప్రవేశించడంలో విఫలమయ్యాడు.[17]

2022 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

[మార్చు]

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారత పురుష లాంగ్‌జంపర్‌గా చరిత్రకెక్కిన మురళీ శ్రీశంకర్‌ అమెరికా వేదికగా 2022 జులై 17న జరిగిన ఫైనల్స్‌లో శ్రీశంకర్‌ 7.96 మీటర్లు లంఘించి ఏడో స్థానంతో సరిపెట్టాడు. ఆయన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 8 మీటర్ల ప్రదర్శనను నమోదు చేసాడు. ఆరు ప్రయత్నాల్లోనూ శ్రీశంకర్‌ ఎనిమిది మీటర్ల మార్క్‌ అందుకోలేకపోయాడు. జినాన్‌ వాంగ్‌ (8.36 మీ, చైనా) స్వర్ణం కైవసం చేసుకున్నాడు.[18]

మూలాలు

[మార్చు]
  1. "Breaking furniture, records too!". Sportstar. 24 January 2019. Retrieved 9 September 2019.
  2. "Federation Cup: Murali Sreeshankar qualifies for Tokyo Olympics, sets national record in long-jump". Retrieved 17 March 2021.
  3. "World Championships : ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత అథ్లెట్‌గా మురళీ శ్రీశంకర్‌ ఘనత". web.archive.org. 2022-07-17. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Long jumper M Sreeshankar looks beyond Tokyo Olympics 2020 after impressive run at European circuit". Firstpost. 25 July 2019. Retrieved 9 September 2019.
  5. Jeemon Jacob Kochi (July 10, 2021). "High flyer | M. Sreeshankar". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-16.
  6. "Long jumper M Sreeshankar looks beyond Tokyo Olympics 2020 after impressive run at European circuit". Firstpost. 25 July 2019. Retrieved 9 September 2019.
  7. "Long Jump prodigy Sreeshankar, on cusp of 8-metre club, eyes Asian Games and Junior Worlds". The Indian Express. 10 March 2018. Retrieved 9 September 2019.
  8. "Journey Has Just Begun, Says Record-holding Long Jumper Murali Sreeshankar". News18. 23 August 2019. Retrieved 9 September 2019.
  9. "Long jumper Sreeshankar finds silver lining in Junior Asian bronze". ESPN.in. 12 June 2018. Retrieved 9 September 2019.
  10. "Long jumper Sreeshankar's CWG dreams over". The Times of India. 25 March 2018. Retrieved 26 August 2018.
  11. "Long jumper M Sreeshankar looks beyond Tokyo Olympics 2020 after impressive run at European circuit". Firstpost. 25 July 2019. Retrieved 9 September 2019.
  12. "Long jumper Sreeshankar finds silver lining in Junior Asian bronze". ESPN.in. 12 June 2018. Retrieved 9 September 2019.
  13. "Long jumper M Sreeshankar looks beyond Tokyo Olympics 2020 after impressive run at European circuit". Firstpost. 25 July 2019. Retrieved 9 September 2019.
  14. "Sreeshankar breaks national long-jump record with season's U-20 best in world". The Times of India. 27 September 2018. Retrieved 9 September 2019.
  15. "National Open Athletics: Sreeshankar and Anjali first to qualify". The Hindu. 5 December 2018. Retrieved 9 September 2019.
  16. "Long Jump: Sreeshankar sets new national record at Federation Cup, books Tokyo Olympics ticket". India Today (in ఇంగ్లీష్). Retrieved 7 August 2021.
  17. "Tokyo Olympics long jump: M. Sreeshankar fails to make cut for final". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 7 August 2021.
  18. "శ్రీశంకర్‌కు నిరాశ". web.archive.org. 2022-07-18. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)