Jump to content

ముళ్లపూడి తిమ్మరాజు

వికీపీడియా నుండి
ముళ్లపూడి తిమ్మరాజు

ఉండ్రాజవరం సంస్థానం తణుకు సమీపంలోని కాల్దరి గ్రామానికి చెందిన పెద్ద "జమీందారీ కుంటుంబం" నుంచి వచ్చిన ముళ్ళపూడి తిమ్మరాజు తండ్రి, ఉండ్రాజవరం సంస్థానాధీశులు,తణుకు జమీందారులు, రైతు రాయడు "శ్రీ ముళ్ళపూడి వెంకట్రాయుడు" గారు. "ఆంధ్రభోజ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారు" తణుకు పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త. సాహిత్యాభిలాషి. సాహితీ పోషకుడు.దేశసేవకుడు.విద్యాపోషకుడు.ముళ్ళపూడి తిమ్మరాజు సాహితీప్రియులు, కళాపోషకులు, జాతీయోద్యమం పట్ల అభిమానం కలిగిన ఆయన తాలూకా బోర్డు అధ్యక్షునిగా పని చేశారు. ఇతడు 1901 అక్టోబరు 10వ తేదీన ముళ్ళపూడి వేంకటరాయుడు, అక్కమాంబ దంపతులకు జన్మించారు. మరణించిన కుమారుడి పేరిట "శ్రీ నరేంద్రసాహిత్యమండలి", "రాయల ప్రెస్" స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా పెన్మెచ్చ సత్యనారాయణరాజు గారి రాజానందము, వేదుల సత్యనారాయణశర్మ గారి బుద్ధగీత, ఆర్యచాణక్యుడు, కాకతి ప్రోలరాజు, తెన్నేటి కోదండరామయ్యగారి మాబడి, గోకులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకము, భద్రభూపాలుడి నీతిముక్తావళి, చల్లా పిచ్చయ్య వ్రాసిన ఉద్యానము ఇంకా గోస్తనీ మాహాత్మ్యము, శివయోగసారము, ముసునూరి కాపయ, సోమదేవరాజీయము మొదలైన గ్రంథాలను ప్రకటించారు. ఇతనికి "ఆంధ్ర భోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ" అనే బిరుదు ఉంది.[1]. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇతని కుమారుడు. ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్, ప్రాథమిక విద్యాసంఘము మొదలైన సంస్థలెన్నింటితోనో సంబంధం కలిగి తన అధికారాన్ని, పలుకుబడిని ప్రజాక్షేమానికే వినియోగించారు. వరుసగా తొమ్మిదేండ్లు తణుకు తాలూకా బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడురు. తన స్వంత గ్రంథాలయాన్ని "కళాప్రపూర్ణ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రము" తాలూకా బోర్డుకు అప్పగించి గ్రంథాలయోద్యమంలో పాలుపంచుకున్నారు[2].

రచనలు

[మార్చు]
  • ఈడ్పుగండి రాఘవేంద్రరావుగారి సంగ్రహచరిత్ర
  • ముళ్లపూడి తిమ్మరాజుగారి ఐతిహాసిక యాత్రలు

మూలాలు

[మార్చు]