Jump to content

ముళ్ళపూడి వెంకటరమణ కథలు

వికీపీడియా నుండి
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కృతికర్త: ముళ్ళపూడి వెంకటరమణ
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సాహిత్యం
ప్రచురణ:
విడుదల:

ముళ్లపూడి వెంకటరమణ కథలు హాస్య, వ్యంగ్య కథలుగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగిఉన్నాయి. వైవిధ్యభరితమైన, విస్తృతమైన ఈ కథల నుంచి పలుకుబళ్లు, కొత్త పదాలు, విలక్షణమైన పాత్రలు తెలుగువారి మాటల్లో భాగమయ్యాయి.

రచన నేపథ్యం

[మార్చు]

జీవితపోరాటంలో పోర్టు గుమస్తా, ప్రూఫ్ రీడర్, పత్రికా సంపాదకుడు, ఫ్రీలాన్స్ జర్నలిజం, సినీ రచన, సినీ నిర్మాత వంటి ఎన్నో వృత్తులు చేసిన ముళ్లపూడి వెంకటరమణ అనుభవాలు ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి. స్వయంగా తాను అనుభవించిన పేదరికం, ఆకలి బాధలు "ఆకలీ-ఆనందరావు" కథలో, నిరుద్యోగం "యువరాజు-మహారాజు" కథలో ప్రతిఫలించాయి. మద్రాసు (నేటి చెన్నై)లో ఆయన కుటుంబంతో నివసించిన తేనెగూడు వంటి వాటాల ఇంటిలో మధ్యతరగతి జీవుల జీవితాలు, ఆ టీకప్పుల్లో తుఫానులు "జనతా ఎక్స్ ప్రెస్" కథాంశానికి ముడిసరుకులుగా మారాయి. సినీ పాత్రికేయునిగా ఆయనకు తెలిసిన తెర వెనుక కథలతో "విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు" రాశారు. ఐతే కథలకు ముడిసరుకుగా వెతలు ఉన్నా ఆ కష్టనిష్టూరాలు హాస్యంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించడం ఈ కథల్లోని ప్రత్యేకత.

ఇతివృత్తాలు

[మార్చు]

ముళ్లపూడి వెంకటరమణ కథలు ఎక్కువగా హాస్య కథలు. అయితే రామాయణంలోని సీతారాముల కల్యాణ ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని కళ్లకుకట్టినట్టు రమణీయమైన వర్ణనలతో రాసిన కథ "సీతాకల్యాణం", ద్వాపర కాలంలో శ్రీకృష్ణుని స్నేహితుడు, అభిమాని ఐన ఒక కళాపిపాసి కృష్ణునికి వేణువు చేసి ఇవ్వాలనే ప్రయత్నంలో అత్యున్నతమైన కళాసృష్టి గురించి కళాకారునికి ఉండే తపన, కళలో పరిపూర్ణత్వానికి ఉండే అవకాశం వంటి విశేషాలతో "కానుక" హాస్యకథలు కానివి. ప్రేమ పేరిట తయారవుతున్న వెర్రిమొర్రితనాలు, సినిమారంగంలో ఉండే కష్టాలు, రాజకీయనాయకుల ఎత్తుగడలు, అప్పులు అడిగి ఎగవేసే వాళ్ల ఎత్తుగడలు, మధ్యతరగతి వాళ్ల జీవితాలకీ, కోర్కెలకీ మధ్య పరుగుపందెం, యువ దంపతుల దాంపత్య జీవన మాధుర్యం, పేదవాళ్ల ఆకలి, నిరుద్యోగుల దుస్థితి వంటి అంశాలను వ్యంగ్యం, హాస్యం జోడించి ఉంటాయి. ఈ కథల్లో సింహభాగం 1950-60ల నాటి పట్టణ ప్రాంతపు మధ్యతరగతి జీవితాలు చిత్రీకరించాయి. అయితే ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు, రాజకీయ భేతాళ పంచవింశతి (గొలుసుకట్టు కథలు) వంటి కొన్ని కథల్లో గోదావరిజిల్లాల గ్రామీణ జీవనం కనిపిస్తుంది.

కథల జాబితా

[మార్చు]
లహరి -1954-55
రాధమ్మ బాకీ - 1954-55
కుమార సంభవం - 1954-55
చుట్టాలొచ్చారు - 1954-55
  • తాంబూలాలిచ్చేశారు.... - ఫిబ్రవరి 1954
  • ఏకలవ్యుడు - మే 1957
  • వరలక్ష్మీ వ్రతం - జనవరి 1956
  • తిమింగిలగిలం - జనవరి 1956
  • ఋణానందలహరి (కథామాలిక) - 1959
ఋణదత్తుని కథ
గుర్నాధం కథ
శేషయ్య కథ
తాతబ్బాయి కథ
అప్పలనర్సయ్య ఉదంతం
ఋణహృదయము
వచ్చినవాడు అప్పారావు
భానుమతి కథ
ఋణోపదేశం
అన్నపూర్ణతో పెళ్లిప్రమాదము
ప్రమాదము తప్పిన ప్రకారము
చెంచయ్య కథ
అప్పడి కథ
ఋణాన్నభుక్కుల కథ
ఋణకేతుని కథ
అడగని కథ
గడసరి కథ
భవిష్యజ్జాతక కథలు
రష్యాలో రామయ్య కథ
గరుడ దర్శనం
అప్పారావు కథ
ఫలశ్రుతి
ౠణదా! శరధీ! కరుణాపయోనిధీ!
  • ఆకలీ ఆనందరావూ - జూలై 1953
  • కన్నీటి పాట - జూలై 1990
  • కృతజ్ఞత - మే 1954
  • చండీదాసు హితోపదేశం - డిసెంబరు 1955
  • లోకయాత్ర
  • సెరిబ్రల్ సినేమియా - మే 1956
  • ప్రాప్తి - జూన్ 1953
  • ప్రయోజకుడు - ఫిబ్రవరి 1954
  • సాక్షి - అక్టోబరు 1959
  • విమానం కథ - 1959

కథనం

[మార్చు]

శైలి-ఉదాహరణలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]