ముషీరాబాద్ మసీదు
ముషీరాబాద్ మసీదు | |
---|---|
మతం | |
అనుబంధం | ఇస్లాం |
ప్రదేశం | |
ప్రదేశం | ముషీరాబాదు, హైదరాబాదు, తెలంగాణ |
వాస్తుశాస్త్రం. | |
గ్రౌండ్‌బ్రేకింగ్ | 1580 CE |
పూర్తైనది | 1611 CE |
మినార్లు | 2 |
ముషీరాబాద్ మసీదు (ముషీరాబాద్ పెద్ద మసీదు లేదా ముషీరాబాద్ జమా మసీదు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న మసీదు.[1][2][3] దీని అసలు భాగాన్ని కుతుబ్ షాహి రాజవంశపు నాల్గవ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించాడు.
చరిత్ర
[మార్చు]1580లో దీని నిర్మాణం ప్రారంభమై 1611 పూర్తయింది. గోల్కొండ పతనం తరువాత, నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II పాలనలో నవాబ్ అరస్తు జా ప్రధానమంత్రి అయ్యేవరకు ఈ మసీదుని ఎవరూ పట్టించుకోలేదు. ఇది 1951లో పునఃనిర్మించబడింది. నమాజ్ చేసుకోవడానికి వీలుగా కొత్తగా నాలుగు అంతస్తుల భాగం నిర్మించబడింది.[4]
నిర్మాణం
[మార్చు]కట్టడాలకు నాలుగు ద్వారాలు నిర్మించడం, సున్నంతో అందమైన డిజైన్లు చెక్కడం ఇరాన్ సంస్కృతిలో భాగం. హైదరాబాదు నగరంలోని వివిధ కట్టడాలపై ఇరానియన్ల ప్రభావం ఉంది. ఈ ముషీరాబాదు మసీదు కూడా ఇరానియన్ శైలీలో నిర్మించబడింది. ఈ మసీదులో ఐదు ఎత్తైన తోరణాలు, మూలల్లో రెండు స్తంభాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Iyer, Lalita (3 June 2018). "Hyderabad: The grandeur of Qutb mosque". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 April 2020.
- ↑ "Jamia Masjid Musheerabad, Musheerabad Mosque Hyderabad – Temples In India Information". templesinindiainfo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 July 2018. Retrieved 8 April 2020.
- ↑ Nanisetti, Serish (19 August 2017). "There lies a forgotten story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 8 April 2020.
- ↑ Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 9788120605435.