ముసుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముసుగుని సాధారణంగా ముఖం మీద ధరిస్తారు ఇవి రక్షణ కోసం, మారువేషంలో , పనితీరు , లేదా వినోదం . ఉత్సవాలలో, ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, అలాగే ప్రదర్శన కళలలో , వినోదం కోసం మాస్క్ లు ఉపయోగించబడుతున్నాయి , పురాతన కాలం నుండి వీటి వినియోగం ఉన్నది.

వైద్య పరమైన మాస్క్ లు[మార్చు]

కాలుష్య ముసుగు (మాస్క్ ) ఉపయోగపడుతుంది, ఇది దుమ్ము అలెర్జీలు, చర్మం, జుట్టు దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు వంటి కాలుష్యం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షణగా ఉండటానికి మీకు సహాయపడుతుందివివిధ పరిమాణాల్లో, వివిధ ఆకారాల్లో వైద్య పరమైన మాస్కులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముక్కు, నోటిని కప్పి ఉంచే విధంగా తల వెనుక కట్టుకోడానికి వీలుగా పట్టీలు/ సాగే తాడులు కలిగి ఉండి, నేసిన వస్త్రంతో చదునుగా తయారుచేసినవే సాధారణంగా వాడుకలో ఉన్నాయి.

Face Mask Disposable for General Use

వీటితో పాటు శంఖాకారం లేదా బాతు ముక్కు ఆకారం లో మాస్కులు, కావాటాలతోనూ లేదా కవాటాలు లేకుండా ముక్కు, నోటిని కప్పి ఉంచి, ముఖం ఆకారానికి సరిపోయే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.

ఎటువంటి వ్యాధి లక్షణాలు లేని ఆరోగ్యవంతులైన వ్యక్తులు వైద్య పరమైన మాస్కులు వాడకూడదు. ఎందుకంటే, ఇది భద్రతకు సంబంధించి తప్పుడు సంకేతాలను ఇచ్చే ప్రమాదముంది. తద్వారా వారు చేతులు కడుక్కోవడం వంటి ఇతర ముఖ్యమైన జాగ్రత్తలను అలక్ష్యం చేసే అవకాశముంది. దీనికి తోడు, సమాజంలోని ఆరోగ్యవంతులైన వ్యక్తులు మాస్కులు ఉపయోగించడం వల్ల వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనం చేకూరుతుంది అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. వాస్తవానికి, మాస్కులు తప్పుగా వినియోగించడం లేదా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోడానికి వీలులేని మాస్కులను ఆరు గంటల కంటే ఎక్కువసేపు తీయకుండా ఉంచుకోవడం, ఒకే మాస్కును అనేక సార్లు ఉపయోగించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అనవసరమైన ఖర్చు పెరుగుతుంది.[1].మార్కెట్‌లోని ముసుగులను మెడికల్ ప్రొటెక్టివ్ మాస్క్‌లు, పార్టికల్ ప్రొటెక్టివ్ మాస్క్‌లు (డస్ట్ మాస్క్‌లు), మెడికల్ సర్జికల్ మాస్క్‌లు, పునర్వినియోగపరచలేని మెడికల్ మాస్క్‌లు, కాటన్ నూలు ముసుగులు, స్పాంజ్ మాస్క్‌లు, యాక్టివేట్ కార్బన్ మాస్క్‌లు మొదలైనవిగా విభజించవచ్చు.అన్నింటిలో మొదటిది, పత్తి నూలు ముసుగులు, స్పాంజి ముసుగులు, ఉత్తేజిత కార్బన్ ముసుగులు గాలిలో పెద్ద కణాలను మాత్రమే ఫిల్టర్ చేయగలవు, కాని చిన్న కణాలను నివారించే పని లేదు. అవి ధరించడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ, వైరస్ల నుండి రక్షణకు వీటితో పెద్ద వుపయోగం లేదు.

కరోనా వైరస్ నుండి రక్షణ కొరకు[మార్చు]

కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇప్పుడు మాస్క్‌ తప్పనిసరి .కరోనా సమయంలో రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. దీనిలో ఎన్‌95 మాస్క్‌ మెరుగ్గా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.[2] మొదట వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లు, కరోనా బారినపడినవాళ్లు ధరిస్తే సరిపోతుందని భావించినా ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్‌ ధరించాల్సిందేనని భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అసాధారణమైన సమయాల్లో అసాధారణమైన పద్ధతులలో, పరిమిత వనరుల పరిస్థితులలో ఎన్‌95 మాస్క్‌ లేకపోతే ,పత్తి నూలు ముసుగులు, స్పాంజి ముసుగులు లేదా ఇంట్లో తయారుచేసిన ఇతర ముసుగులు అయినా, బిందువుల వైరస్ వ్యాప్తిని కొంతవరకు నిరోధించగలదు.

వైద్య పరమైన మాస్క్ ను సక్రమంగా ఉపయోగించే విధానం[మార్చు]

మీ ముక్కు, నోరు, గడ్డం పై దాన్ని పెట్టాలి. మాస్క్ పై భాగంలో సులభంగా వంచడానికి అనువుగా ఉండే ముక్కు పట్టీ (సులువుగా గుర్తించగలిగే లోహపు పట్టీ) ని ముక్కు పైన అమర్చుకోవాలి. తాళ్లతో మాస్క్ ను కట్టాలి. ( పైన ఉండే తాడును చెవుల పైనుండి తీసి తల వెనుక కట్టాలి - కింద వైపున ఉండే తాడును మెడ వెనుక భాగంలో కట్టాలి.) మాస్క్ రెండు వైపులా ఖాళీలు లేకుండా నిర్ధారించుకుని, ముఖానికి దగ్గరగా ఉండేవిధంగా సవరించుకోవాలి. మాస్క్ ను ధరించినప్పుడు, దానిని ముట్టుకోకూడదు. మాస్క్ మెడ నుండి వ్రేళ్లాడకుండా చూసుకోవాలి. మాస్క్ ధరించిన ఆరు గంటల అనంతరం లేదా అది తడిసిన వెంటనే వేరొక మాస్క్ ను ధరించాలి. ఒక సారి మాత్రమే ఉపయోగించడానికి వీలున్న మాస్క్ లను తిరిగి ఉపయోగించకూడదు. వాటిని పారవేయాలి. మాస్క్ ను తీసేటప్పుడు, కలుషితమైన మాస్క్ ఉపరితలాన్ని చేతితో తాకకుండా, అత్యంత జాగ్రత్త వహించాలి. మాస్క్ తొలగించేటప్పుడు, ముందుగా మాస్క్ క్రింది తాళ్లను విప్పి, ఆ తర్వాత పైన ఉన్న తాళ్లను విప్పి, వాటిని పట్టుకుని మాస్క్ ను బయట పడవేయాలి. ఉపయోగించిన మాస్కులను పారవేయాలి : ఉపయోగించిన మాస్కులను వైరస్ సోకిన మాస్కులుగా పరిగణించాలి. రోగులు / వారి పరిరక్షకులు / గృహ పర్యవేక్షణలో వారితో సంబంధం ఉన్న వారు ఉపయోగించిన మాస్కులను సాధారణ 5 శాతం బ్లీచింగ్ ద్రావణం లేదా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించి శుభ్రం చేసి ఆ తర్వాత వాటిని దహనం చెయ్యాలి లేదా లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టాలి.

మూలాలు[మార్చు]

  1. "Press Information Bureau". pib.gov.in. Retrieved 2020-06-05.
  2. "New Research: For N95 masks, a more efficient, replaceable filter". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-26. Retrieved 2020-06-05.
"https://te.wikipedia.org/w/index.php?title=ముసుగు&oldid=3851435" నుండి వెలికితీశారు