ముస్లింల క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముస్లింల క్రికెట్ జట్టు
cricket team
స్థాపన లేదా సృజన తేదీ1912 మార్చు
మతంఇస్లాం మార్చు
క్రీడక్రికెట్ మార్చు
పాల్గొన్న ఈవెంటుబాంబే క్వాడ్రాంగులర్ మార్చు
దేశంబ్రిటిషు భారతదేశం మార్చు
రద్దు చేసిన తేది1946 మార్చు

ముస్లింల క్రికెట్ జట్టు, వార్షిక బొంబాయి టోర్నమెంట్‌లో పాల్గొన్న భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఈ బృందాన్ని బొంబాయిలోని ముస్లిం కమ్యూనిటీ సభ్యులు స్థాపించారు.

ఆ సమయంలో మహమ్మదీయులుగా పిలువబడే ముస్లింలు - 1912 లో బొంబాయి టోర్నమెంట్‌లో చేరారు. వారు పోటీని విస్తరించడంలో భాగంగా యూరోపియన్లు, హిందువులు, పార్సీల ఆహ్వానాన్ని అంగీకరించారు. ఈ జట్టు కూడా చేరడంతో దీనిని బాంబే క్వాడ్రాంగులర్ అని పేరు మార్చారు.

1913-14లో హిందువులతో జరిగిన మ్యాచ్ డ్రా అవడంతో హిందూ, ముస్లింలు టైటిల్‌ను పంచుకున్నారు.[1] 1924-25లో హిందువులను ఓడించి మొదటిసారి టైటిలును గెలిచుకున్నారు.[2] టోర్నమెంటు చివరి దశాబ్దంలో ఈ జట్టు బలంగా ఉండేది. 1934-35, 1944-45 మధ్య ఈ జట్టు ఆరుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. 1944-45 ఫైనల్‌లో వారు హిందువులను ఒక వికెట్ తేడాతో ఓడించారు. KC ఇబ్రహీం 52, 137 నాటౌట్ స్కోరు చేశాడు. అమీర్ ఎలాహి 89–22–223–9 మ్యాచ్ గణాంకాలు సాధించాడు. [3]

మూలాలు[మార్చు]

  1. "Hindus v Mohamedans 1913-14". Cricinfo. Retrieved 9 June 2023.
  2. "Hindus v Mohamedans 1924-25". Cricinfo. Retrieved 9 June 2023.
  3. "Hindus v Muslims 1944-45". CricketArchive. Retrieved 9 June 2023.