ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017 లేదా ట్రిపుల్ తలాక్ బిల్లును 28 డిసెంబర్ 2017 రోజున లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే ఈ దురాచారానికి స్వస్తి పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. సుప్రీం ఆదేశాలతో ట్రిపుల్‌ తలాక్‌కు చరమగీతం పాడేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది.[1]

చరిత్ర

[మార్చు]

ట్రిపుల్‌ తలాక్‌ చట్ట విరుద్దమని . ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రాథమిక హక్కులకు భంగకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. తలాక్‌ చెప్పి విడాకులు తీసుకుంటే నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి, గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని ఈ బిల్లులో కేంద్రం పొందుపర్చింది. ట్రిపుల్‌ తలాక్‌ మహిళల హక్కులను హరిస్తోందని గత ఆగస్టు 22, 2017న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

మంత్రివర్గ ఉపసంఘం

[మార్చు]

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తలాక్‌ ట్రిపుల్‌పై ఎర్పడింది. ఇందులో సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ప్రసాద్‌, రిపీపీ చౌదరిలు సభ్యులుగా ఉన్నారు.

వివరాలు

[మార్చు]
  • ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాఖ్ అని భర్త నోటితో చెప్పినా, రాత పూర్వకంగా తెలిపినా, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్ సందేశాలను పంపినా అక్రమమే.
  • ఈ చట్టం ప్రకారం దోషిగా తేలితే మూడేండ్ల జైలుతోపాటు జరిమానా కూడా విధిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు- 2017. "లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 29 December 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]