మూగ ప్రేమ

వికీపీడియా నుండి
(మూగప్రేమ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మూగ ప్రేమ
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ నసీమ్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కె బాలచందర్ తమిళ చిత్రం తెలుగులో తీయబడింది.కె.చటర్జీ నిర్మాత.సంగీత దర్శకుడిగా చక్రవర్తి తొలి చిత్రం."ఈ సంజె లో కెంజాయలో" ,"జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు","నాగులేటి వాగులోన","పోవనివ్వం పోనివ్వం " వంటి జనరంజకమైన పాటలున్నాయి.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

వాసుదేవరావు అనే అతని ఇంట్లో కమల అనే అమాయకురాలు పనిమనిషిగా చేరుతుంది. వాసుదేవరావు తమ్ముడైన మురళిని చూసి ముచ్చటపడి, అతన్ని మనసులోనే ప్రేమిస్తుంది. మురళి, రాధ అనే అమ్మాయిని చూసి, ఆమె ఎవరని తెలుసుకోకుండా ప్రేమిస్తాడు. ఆమె కమల స్నేహితురాలు. ఆ విషయం తెలుసుకుని, కమల లోలోన బాధపడుతుంది. వాసుదేవరావు తన తమ్ముడికి కమలను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కాని, కమల బలవంతం మీద, రాధకు ఇచ్చి వివాహం చేస్తాడు. కమల రాసిన ఒక నవల చదివిన రాధ, ఆ కథ కమల కథేనని తెలుసుకుని, ఆమె చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, తాను కావాలని కాలు పోగొట్టుకుంటుంది. కమల తనను ప్రేమించిన విషయం మురళి తెలుసుకుంటాడు. కమలకు ఇంకొక వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. కాని కథ మరోలా సమాప్తమవుతుంది.

నటీనటులు[మార్చు]

  • వాణిశ్రీ
  • విజయలలిత
  • జి.వరలక్ష్మి
  • సూర్యకాంతం
  • శోభన్ బాబు
  • రమణారెడ్డి
  • చలం
  • ప్రభాకరరెడ్డి

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం : గుత్తా రామినీడు
  • మాటలు, పాటలు : ఆచార్య ఆత్రేయ
  • సంగీతం : చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • కళ : రాజేంద్రకుమార్
  • కూర్పు : అంకిరెడ్డి
  • నిర్మాత : ఎన్.ఎన్.భట్

పాటలు[మార్చు]


వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
2 జిలిబిలి పలుకుల చెళ్లెల్లు చిలిపి తనాల తమ్ముళ్లు ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
3 మొయిలు చూసి మురిసి పోయి నటనమాడు నెమలి ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
4 ఈ సంజెలో కెంజాయలో చిరిగాలుల ఆచార్య ఆత్రేయ చక్రవర్తి పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
5 వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
"https://te.wikipedia.org/w/index.php?title=మూగ_ప్రేమ&oldid=2105958" నుండి వెలికితీశారు