Jump to content

మూల కణం

వికీపీడియా నుండి
విలక్షణమైన అల్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్షణాలను ప్రదర్శించే మెసెంచిమల్ స్టెమ్ సెల్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్

మూల కణం (ఆంగ్లం: Stem cell) అనేది బహుకణ జీవుల్లో అనంతంగా పెరుగుతూ ఉండే కణాలు. ఒక మూల కణం నుంచి కణ విచ్ఛిత్తి (Cell division) ప్రక్రియ ద్వారా మరిన్ని మూలకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.[1] శరీరంలో అనేక రకాల కణాలుగా అభివృద్ధి చెందగల సామర్థ్యం ఉన్న మూల కణాలు శరీరానికి మరమ్మతు వ్యవస్థగా పనిచేస్తాయి. [2]

రకాలు

[మార్చు]

స్టెమ్ సెల్స్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి: అవి 1) పిండ మూల కణాలు; 2) వయోజన మూల కణాలు.

మూల కణాలు శరీరంలోని ఇతర కణాల కంటే సామర్థ్యంలో విభిన్నంగా ఉంటాయి: 1) మూల కణాలు చాలా కాలం పాటు తమను తాము విభజించుకుని పునరుద్ధరించుకోగలవు; 2) ప్రత్యేకత లేని కణాలు శరీరంలో నిర్దిష్ట విధులను నిర్వహించలేవు; 3) మూల కణాలు కండరాల కణాలు, రక్త కణాలు, మెదడు కణాలు వంటి ప్రత్యేక కణాలుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.[2]

చికిత్సలో ఎవరి మూలకణాలు ఎవరికైనా ఉపయోగపడుతాయి. కణజాలాలు , రక్తం గ్రూపు కలవవనక్కర లేదు. జన్యు వైవిధ్యం పట్టింపు లేదు. [3]

ప్రయోగాలు

[మార్చు]

వైద్యులు, శాస్త్రవేత్తలకి మూల కణాల గురించి ఆరోగ్యం, వైద్య పరిశోధనలు, విభిన్న రంగాలలో సహాయపడతాయి. మూల కణాలను అధ్యయనం చేయడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులు గురించిన అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.[2]

1960వ దశకంలో కెనడా లోని టొరంటో విశ్వవిద్యాలయం, ఒంటారియో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెందిన పరిశోధకులు జీవకణాల మీద చేసిన ప్రయోగాలతో మూలకణాల మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి.[4][5] 2016 నాటికి బాగా గుర్తింపు పొందిన మూలకణ చికిత్స హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే.[6] దీన్ని మొదటిసారిగా 1958లో ఫ్రెంచి అంకాలజిస్టు అయిన జార్జెస్ మాథే చేశాడు.

ప్రసవ సమయంలో బొడ్డుతాడు, మాయ ను శుద్ధి చేసి మూల కణాలను సేకరించి స్టెమ్ సెల్ బ్యాంకు లో - 196 డిగ్రీల దగ్గర లిక్విడ్ నైట్రోజన్ లో మూల కణాలను భద్రపరచడం ద్వారా ప్రయోజనాలు గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిని ఉపయోగించి క్రీము , ఇంజెక్షన్లు తయారు చేస్తున్నారు. శరీరంలో క్షీణత ఉన్నదగ్గర మూలకణాలు ఉపయోగపడతాయి. [3]

మూలాలు

[మార్చు]
  1. "బొడ్డుతాడు... రోగాలకు ముకుతాడు". andhrabhoomi.net. Retrieved 2023-06-16.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 "Stem Cells". National Library of Medicine, National Institutes of Health. 2025-01-25. Retrieved 2025-03-02.
  3. 3.0 3.1 "మూల కణాలతో ఔషధ ప్రయోగాలు వేగిరం". ఈనాడు. 2025-02-04.
  4. Becker AJ, McCulloch EA, Till JE (February 1963). "Cytological demonstration of the clonal nature of spleen colonies derived from transplanted mouse marrow cells". Nature. 197 (4866): 452–454. Bibcode:1963Natur.197..452B. doi:10.1038/197452a0. hdl:1807/2779. PMID 13970094. S2CID 11106827.
  5. Siminovitch L, McCulloch EA, Till JE (December 1963). "The distribution of colony-forming cells among spleen colonies". Journal of Cellular and Comparative Physiology. 62 (3): 327–336. doi:10.1002/jcp.1030620313. hdl:1807/2778. PMID 14086156. S2CID 43875977.
  6. Müller AM, Huppertz S, Henschler R (July 2016). "Hematopoietic Stem Cells in Regenerative Medicine: Astray or on the Path?". Transfusion Medicine and Hemotherapy. 43 (4): 247–254. doi:10.1159/000447748. PMC 5040947. PMID 27721700.
"https://te.wikipedia.org/w/index.php?title=మూల_కణం&oldid=4436955" నుండి వెలికితీశారు