మూస:ఈ వారం వికీ చిట్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Wiki letter w.svg ఈ చిట్కాను వాడి మరింత సమర్ధవంతంగా వికిపీడియా ను ఉపయోగించండి
మరిన్ని చిట్కాలను వికీపీడియా:వికీ చిట్కాలు లో చేర్చండి.

వికిపీడియాలో "సంతకం" చెయ్యడం ఎలా?[మార్చు]

వికిపీడియా లో సభ్యులు చర్చా పేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట.


సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.

  1. సభ్యనామం రాయడం
  2. సభ్యనామం తో పాటు తేదీ, సమయం కూడా రాయడం
  3. తేదీ, సమయం మాత్రమే రాయడం

సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -

  • 3 సార్లు నొక్కితే - సభ్యనామం
  • 4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం
  • 5 సార్లు నొక్కితే - తేదీ, సమయం

పడతాయి. మీరు లాగిన్‌ అయి ఉంటే సభ్యనామం పడుతుంది, లేదంటే, మీ ఐ పి అడ్రసు పడుతుంది.


ఇది చూడండి - Chaduvari 06:29, 25 August 2005 (UTC) - ఇది ఈ రచయిత సంతకం, తేదీ, సమయం.

దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి లో ఇటువంటి వివరాలు ఇంకా ఉన్నాయి చూడండి.

ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి.

వికీ చిట్కాలు