మెన్ ఇన్ లవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
BookCover MenInLove.jpg

మెన్ ఇన్ లవ్, పురుషుల లైంగిక ప్రవృత్తుల, ఆకాంక్షల గురించిన ఒక ఒక ఆంగ్ల రచన. ఆంగ్లంలో పూర్తి పేరు MEN IN LOVE - Men's Sexual Fantacies, The triumph of love over rage. రచయిత్రి పేరు నాన్సీ ఫ్రైడే.


ఈ పుస్తకం స్త్రీలని ప్రేమించే పురుషుల గురించి. ఇది ప్రేమికుల గురించి కాదు. పురుషుల రహస్య, లైంగిక కల్పనల గురించిన అధ్యయనం. పరస్పర జాతులపై పురుషులకున్నలోతైన, విరుద్ధ భావాల దర్యాప్తు. స్త్రీని ఒక రసరమ్య కథానాయిక గానో, ఒక వేశ్యగానో మాత్రమే పురుషుడు చూస్తాడు అన్న నానుడి నుండి, పురుషుల హృదయం చుట్టూ భ్రమించే ప్రేమ, అసహ్యం వంటి మానసికోద్రేకాలను తెలుపుతుంది. వివిధ వయస్కుల (14 - 60 ఏళ్ళ) పురుషుల నుండి వచ్చిన నిష్కపటమైన స్పందనల ఆధారంగా రచించబడ్డ ఈ పుస్తకం వారి లైంగిక తత్త్వంపై వారికున్న స్వయం భావాలని మార్చటమే కాకుండా వారిని లాలించి పాలించే స్త్రీలకి పురుషుల గురించి మునుపెన్నడూ లేనంత క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ఉపయోగపడినది.

ఈ పుస్తకం సమకాలీన అమెరికాలో మగాడి గా ఉండటం తెలిపే మొగలి విహారం. పురుషత్వాన్ని ప్రేరేపించే, రెచ్చగొట్టే ఎన్నటికీ వెలువడని కల్పనలు, ఊహలు, వ్యామోహాలు ఇందులో అక్షరీకరింపబడ్డాయి. ఈ చారిత్రక అధ్యయనాన్ని సృష్టించటానికి న్యాన్సీ అన్నింటికీ సమ్మతించి, బిడియాన్ని వదిలి, నిరపరాధ భావంతో వారి స్పందనలు విన్నది. సత్యాలు, వాస్తవాలైన; దాచివేయబడ్డ, నిషేధించబడ్డ వారి రహస్య ఉద్యానవనాలని అందరికీ చూపటానికి, వారికి ఒక వేదికని ఏర్పరచింది. పురుషులు ఎలా ప్రేమించాలి అనే శృంగార కావ్యంగా కాకుండా, వాస్తవానికి వారు ఎలా ప్రేమిస్తారు, వారి హృదయాంతరాలలో, మనస్సు పొరలలో దాగి ఉన్న వాంఛలేమిటి అనే ఆశ్చర్యకరమైన పరకాయప్రవేశానికి ద్వారమే ఈ పుస్తకం.

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

http://www.amazon.com/Men-Love-Nancy-Friday/dp/0385333420/ref=pd_sim_b_2