Jump to content

మేము సైతం

వికీపీడియా నుండి

హుదూధ్ తుఫాన్ బాధితుల సహాయార్థం టాలీవుడ్ అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమం పేరు "మేము సైతం " నవంబరు 30 2014 న హుద్ హుద్ బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై టెలీథాన్ అర్ధరాత్రి 11 వరకు సాగింది. ప్రేక్షకులను అలరిస్తూ ఘనవిజయం సాధించింది.

స్టార్ హీరోల ప్రదర్శనలు, కబడ్డీ, స్టార్ క్రికెట్ మ్యాచ్ లు, వినోదభరితమైన అంతాక్షరి కార్యక్రమం ముగిసే వరకూ కొనసాగాయి. కార్యక్రమం ముగిసే సమయానికి 11,51,56,116/- రూపాయల విరాళాలు సమకూరాయి. ముఖ్య అతిధికి హాజరయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్ రూపంలో అందజేశారు.

చిత్రసీమకు చెందిన పలు శాఖలవారు ఒక్కటై చేసిన ‘మేము సైతం’ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల వరకు ఆద్యంతం వినోదభరితంగా, కన్నులపండువగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగగా, ఆ తర్వాత నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో కబడ్డీ, క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఎనిమిదేళ్ల క్రితం అత్యంత వైభవంగా జరిగిన తెలుగు చిత్రసీమ వజ్రోత్సవాల అనంతరం పరిశ్రమలోని అత్యధికులు పాల్గొన్న కార్యక్రమం ‘మేము సైతం’ అని చెప్పాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=మేము_సైతం&oldid=2889383" నుండి వెలికితీశారు