Jump to content

మేరీ అల్లిట్

వికీపీడియా నుండి
మేరీ అల్లిట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మేరీ లాయ్ (నీ అల్లిట్)
పుట్టిన తేదీ(1925-11-01)1925 నవంబరు 1
డెనిలిక్విన్, న్యూ సౌత్ వేల్స్,
ఆస్ట్రేలియా
మరణించిన తేదీ2013 డిసెంబరు 10(2013-12-10) (వయసు 88)
ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్ బ్రేక్
పాత్రబాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 35)1951 జూన్ 16 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1963 20 జులై - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1940s–1960sన్యూ సౌత్ వేల్స్ బ్రేకర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్
మ్యాచ్‌లు 11
చేసిన పరుగులు 348
బ్యాటింగు సగటు 17.40
100లు/50లు 0/1
అత్యుత్తమ స్కోరు 76
క్యాచ్‌లు/స్టంపింగులు 3/–
మూలం: CricketArchive, 2014 జనవరి 6'

మేరీ లాయ్ ఒక ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1925 నవంబరు 1 న ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ లో జన్మించింది. అసలు పేరు నీ అల్లిట్. ఆమె వివాహిత పేరు మేరీ లాయ్. 1963లో మూడు సందర్భాలలో ఆస్ట్రేలియా జాతీయ మహిళల జట్టుకు నాయకత్వం వహించింది. 1961లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆడిన తర్వాత ఆమె 11 టెస్టులు ఆడి, అత్యధికంగా 76 పరుగులు చేసింది. ఆమె న్యూ సౌత్ వేల్స్ తరపున కూడా దేశీయ క్రికెట్ ఆడింది.[1]

1960లలో నిధుల కొరత, ప్రజా ఆసక్తి తగ్గిన కారణంగా ఆస్ట్రేలియా మహిళల ఆట తగ్గింది. ఆ దశాబ్దంలో ఆస్ట్రేలియా జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లకు విజయాలు లేవు.[2] మేరీ అల్లిట్ 1963 ఇంగ్లాండ్ పర్యటనలో జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 1970ల ప్రారంభంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన వారి మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఓడి పోయింది.[3] అయినప్పటికీ, మేరీ అల్లిట్ వంటి కొంతమంది అంకితభావం కలిగిన క్రీడాకారులు, నిర్వాహకులు పాఠశాలలు, జూనియర్ క్లబ్‌లలో చేసిన కీలక ప్రయత్నాల కారణంగా, మహిళా క్రికెట్ యొక్క విస్తృత అభివృద్ధి, మద్దతు మరోసారి పెరగడం ప్రారంభించింది. ఆమెకు 2007 జూన్లో 'మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా'ను ప్రదానం చేశారు [2]

2000 ఆగస్టు 23న, అల్లిట్ కి ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ మెడల్[4] లభించింది. 2001 జనవరి 1న క్రికెట్ కి ఆమె చేసిన కృషికి 'సెంటెనరీ మెడల్' లభించింది.[5] మేరీ లాయ్ కి ఆట పట్ల ఆమె జీవితకాల నిబద్ధతకు గుర్తింపుగా 2007 జూన్లో 'మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' ను ప్రదానం చేశారు.[6]

అల్లిట్ 2013 డిసెంబరు 10 న మరణించింది. ఆమె మరణించిన తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా CEO జేమ్స్ సదర్లాండ్ మాట్లాడుతూ, మేరీ అల్లిట్ "మహిళల క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందింది. "నేటి శ్రేష్టమైన క్రీడాకారులకు మార్గం సుగమం చేసింది.[7] క్రికెట్ ఆస్ట్రేలియా వారి సంస్మరణలో ఆమె మహిళల క్రికెట్ కు " ట్రైల్ బ్లేజర్ " అని, ఇంకా "పయినీర్ "గా అభివర్ణించారు.[8]

సూచనలు

[మార్చు]
  1. "cricinfo - Mary Allitt".
  2. 2.0 2.1 Duncan, Isabelle (2013-05-28). Skirting the Boundary: A History of Women's Cricket (in ఇంగ్లీష్). Biteback Publishing. ISBN 978-1-84954-611-9.
  3. "Full Scorecard of NZ Women vs AUS Women Only Test 1972 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-12-12.
  4. "Mary Allitt". Department of the Prime Minister and Cabinet. Retrieved 31 December 2012.
  5. "Mary Allitt Loy". Department of the Prime Minister and Cabinet. Retrieved 31 December 2012.
  6. "Mary Loy OAM". Department of the Prime Minister and Cabinet. Retrieved 31 December 2012.
  7. "Trailblazer Mary Loy passes away". 2014-01-06. Archived from the original on 6 January 2014. Retrieved 2020-12-12.
  8. "Trailblazer Mary Loy passes away" Archived 6 జనవరి 2014 at the Wayback Machine – Cricket Australia. Published 12 December 2013. Retrieved 6 January 2013.

బాహ్య లింకులు

[మార్చు]