Jump to content

మే పుష్పం

వికీపీడియా నుండి
ఫుట్బాల్ లిల్లీ / బ్లడ్ లిల్లీ
స్కాడొక్సస్ మల్టీఫ్లోరస్ (బ్లడ్ లిల్లీ)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
2021 మే మాసంలో విరబూసిన మే పుష్పం, హైదరాబాదు

పుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ (Scadoxus Multiflorus) చూడ్డానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. దినినే స్థానికంగా భారతదేశంలో మే పుష్పం అంటారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు.

ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క. ఒక్క సారి నేలలో పాతితే అది చనిపోవడం అంటూ ఉండదు. నెమ్మదిగా పిలకలు వేస్తూ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంతగా ఇది పూలతో వికసిస్తుంది.

మొగ్గ పువ్వుగా విచ్చుకోవడానికి సుమారు ఇరవై రోజులు పడుతుంది. ఒకటిన్నర నుంచి రెండడుగుల ఎత్తు ఉండే ఈ మొక్క తక్కిన కాలం అంతా పచ్చని వెడల్పాటి ఆకులతో అలరిస్తుంది.

అందుకే దీనిని ల్యాండ్ స్కేపుల్లో అంచులకు వాడతారు. దీనిని బొకేల్లో వాడరు. కానీ కట్ ప్లవర్ మాదిరిగా ప్లవర్ వాజ్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఒక దుంపకి ఒక పువ్వే పూస్తుంది.

ఎక్కువ పూలు కావాలంటే అన్ని దుంపలు నాటుకోవాల్సిందే. దీనికుండే మరో ప్రత్యేకత మన ఇంట్లో దుంపలు ఎంత పాతవయితే పువ్వు పరిమాణం పెరుగుతూ వస్తుంది.

అంటే మొదటి ఏడాది చిన్న బంతిలా పూస్తే రెండు మూడేళ్ల తర్వాత పెద్ద పెద్ద పూలతో వికసిస్తుంది. ఏటికేడాది దీని పరిమాణం పెరుగుతుంది. ఇసుక నేలల్లో బాగా పెరుగుతుంది.

రోజులో ఎండ నాలుగు గంటలు పాటు ఉండాలి. కట్ ప్లవర్ గా అలంకరించుకొంటే పొడవాటి ప్లవర్ వాజులని వాడాలి.


మూలాలు

[మార్చు]

మే 31, 2012 ఈనాడు వసుంధర పేజి

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మే_పుష్పం&oldid=3476977" నుండి వెలికితీశారు