మైపాడు బీచ్
Jump to navigation
Jump to search
మైపాడు బీచ్ | |
---|---|
ప్రదేశం | మైపాడు, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 14°30′24″N 80°10′44″E / 14.5068°N 80.1790°E |
Offshore water bodies | బంగాళాఖాతం |
Geology | బీచ్ |
బంగాళాఖాతం తీరంలో ఉన్న ఒక బీచ్ మైపాడు బీచ్. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల (16 మైళ్ల) దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చే నిర్వహించబడుతుంది. ఈ బీచ్ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశాలు అందిస్తుంది, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.[1][2] ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్ వంటి వాటిని అభివృద్ధి చేయటం ద్వారా, వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయటం ద్వారా మైపాడు బీచ్ ను ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు ఇక్కడ సముద్రంలో బోటు షికారు చేయడానికి పర్యాటక అభివృద్ధి సంస్థ బైకు వంటి మరబోటును ఏర్పాటు చేసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Mypadu Beach". AP Tourism Portal. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 30 June 2014.
- ↑ "Fisheries". discoveredindia. Archived from the original on 9 జూన్ 2014. Retrieved 30 June 2014.
- ↑ "Mypadu beach attractions". The Hindu. Nellore. 11 June 2014. Retrieved 24 July 2014.