మై మస్రీ
మై మస్రీ | |
---|---|
జననం | మై మస్రీ 1959 ఏప్రిల్ 2 |
జీవిత భాగస్వామి | జీన్ చామౌన్ |
మై మస్రీ (జననం ఏప్రిల్ 2, 1959) యునైటెడ్ స్టేట్స్ లో చదువుకున్న పాలస్తీనా చిత్ర దర్శకురాలు. తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించింది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]మై మస్రీ 1959, ఏప్రిల్ 2న జోర్డాన్ లో జన్మించింది.[2] ఈవిడ తండ్రి మునిబ్ మస్రీ నబ్లూస్ కు చెందినవాడు, తల్లి టెక్సాస్ కి చెందిన అమెరికన్. తన జీవితంలో ఎక్కువ కాలం బీరూట్ లోనే జీవించింది.
మై మస్రీ 1981లో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి పట్టభద్రురాలయింది. ఆ వెంటనే బీరూట్ కు వచ్చి చిత్రాలను తీయడం ప్రారంభించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1982లో లెబనీస్ చిత్ర నిర్మాతైన జీన్ చామౌన్ ను మస్రీ కలుసుకుంది. వారిద్దరు కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. 1986 లో మస్రీ, జీన్ చామౌన్ ల వివాహం జరిగింది. వీరికి నూర్, హనా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నూర్, పర్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తిచేయగా... హనా న్యూయార్క్ లో నటి, దర్శకురాలిగా పనిచేస్తుంది.
చిత్రాల జాబితా
[మార్చు]మస్రీ తీసిన చిత్రాలలో పాలస్తీనా నేపథ్యం ఎక్కువగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాలలో అవార్డులు కూడా గెలుచుకున్నాయి.
- అండర్ ది రూబుల్ (1983)
- వైల్డ్ ఫ్లవర్స్: ఉమెన్స్ అఫ్ సౌత్ లెబనాన్ (1986)
- వార్ జనరేషన్ (1989)
- చిల్డ్రన్స్ ఆఫ్ ఫైర్ (1990)
- సస్పెండెడ్ డ్రీమ్స్ (1992)
- హనన్ అశ్వ్రావి: ఎ వుమన్ అఫ్ హర్ టైం (1995)
- చిల్డ్రన్స్ ఆఫ్ షటిల (1998)
- ఫ్రాంటియర్స్ అఫ్ డ్రీమ్స్ అండ్ ఫియర్స్ (2001)
- బీరూట్ డైరీస్ (2006)
- 33 డేస్ (2007)
- 3000 నైట్స్ (2015)
మూలాలు
[మార్చు]- ↑ "Mai Masri". IMDb.
- ↑ Hillauer, Rebecca (2005). "Masri, Mai (1959–)". Encyclopedia of Arab Women Filmmakers. Cairo: American Univ. in Cairo Press. pp. 223–235. ISBN 977-424-943-7.