మొండిబండ
మొండి బండ. బండరాజులు. బండ. మొండి. అన్ని పిలుస్తారు క్రీస్తు పూర్వం రాజ్యలను పాలించారు సమంత రాజులుగా, సైన్యాధి కారులుగా కూడా పనిచేసారు తరువాత యుద్దలు ఒడి పోయి రాజ్యాలు కోల్పోయి దేశాలు తీరగడం ప్రారంభించారు బ్రిటిష్ కాలంలో వారితో వాణిజ్యమ్ ప్రారంభించినరు.వాణిజ్యంలో వెంట్రుకలు చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.వీరు రెడ్డి రాజుల దగ్గర సమంత రాజులుగా కూడా పనిచేశారు.అందువలన వీరికి రెడ్డిగారి దగ్గర మీరసులు తీసుకుంటారు మొండిబండ బి.సి.ఏ.గ్రూపు కులం. సంచారజాతిగా ఊరూవాడ తిరిగే మొండిబండ కులస్థులు ఇప్పుడు స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. చిక్కెంట్రుకలు (మహి ళలు తలదువ్వుకోగా దువ్వెనకు చిక్కిన చిక్కు వెండ్రుకలు) వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వరికోతల సమయంలో రైతుల దగ్గర మిరాసీ వసూలు చేసుకునేవారు. కత్తి చేతపట్టి తమని తాము హింసించుకొంటూ మీరసులు అడిగే వారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తిని బట్టి వీరు యాచించే తీరు మార్చుకునేవారు.వీరు పాముల వారి దగ్గర మిగతా కులాల వారి దగ్గర వారు విక్రాంచిన వెంట్రుకలు కొనుకొని వాటిని చైనా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు ఇలా రాష్ర్ట మంతటా సంచారం చేస్తూనే ఉంటారు . సేకరించిన చిక్కెంట్రుకలను వేడి నీళ్లలో ఉడకబెట్టి శుభ్రం చేసిన వెంట్రుకలు పెద్ద పెద్ద గోతలలో పెట్టి ఎక్సపోర్ట్ చేస్తారు.వెంట్రుకలకు పిలిచే టెండర్‌లలో వీరు ఎక్కువుగా పాల్గొంటారు .శ్రీశైలం దేవాలయంలోని మొక్కుబడి వెంట్రుకల టెండర్‌లో పాల్గొనాలంటే కోటి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. దాదాపు అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇదేపద్ధతి ఉంది. తరాల కిందట వీరు ప్రారంభించిన ఈ వెంట్రుకల వ్యాపారం నేడు దేశం ఎల్లలు దాటింది. ఇది బడా బాబులు చేతుల్లోకి వెళ్ళి విదేశీ ఎగుమతి వ్యాపారంగా మారింది. ఆంధ్రప్రదేశ్. కర్ణాటక.తెలంగాణ. ఏలూరులో కోట్లాది రూపాయలతో ఈ వెంట్రుకలను ఎగుమతి చేసే కంపెనీలు వెలిశాయి. ఆయా కంపెనీల్లో ఒక్కొక్క యూనిట్ ఖరీదే కోట్లలో ఉంది. ఈ వెంట్రుకలతో విగ్గులు తయారు చేస్తున్నారు. `ఏ గ్రేడ్ వెండ్రుకలు టన్ను 90 లక్షల రూపాయలు పలుకుతోంది. రెండు, మూడు గ్రేడ్‌ల నాణ్యత కల వెంట్రుకలకు వరుసగా 60 లక్షలు, 30 లక్షల రేటుంది. వెంట్రుకలపై ఏడాదికి దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.ఈ వ్యాపారం వీరు మొదటగా ప్రారంభించినందున వీరికి . మొక్కుబడి వెంట్రుల్లో 30 శాతం తమకివ్వాలని ఈ కులస్తులు కోరుతున్నారు.వీరికి ఉద్యోగాలు కూడా చాలా తక్కువుగా వస్తాయి అందువలన ఈ కులస్తులకి ప్రభుత్వం రిజర్వేషన్ లు కలిపించి వీరి పిల్లలకి ఉద్యోగాలు అవకాశం కలిపించాలని కోరుతున్నారు. వీరిలో చాలా శాతం మంది సొంత ఇల్లు కూడా లేక రేషన్ కార్డులు లేక ఇబందులు పడుతున్నారు ప్రభుత్వం వీరిని పాటించుకోవాలీసిందిగా కోరుతున్నారు .