Jump to content

మొలాయ గోస్వామి

వికీపీడియా నుండి
మొలాయ గోస్వామి
మొలాయ గోస్వామి (2013)
వృత్తినటి
జీవిత భాగస్వామిప్రదీప్ గోస్వామి
పిల్లలునిషితా గోస్వామి

మొలాయ గోస్వామి, అస్సామీ సినిమా నటి. 1992లో 39వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫిరింగోటి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మొలాయ గోస్వామి అస్సాంలోని డిబ్రూగర్ లోని రాజ్‌ఖోవా కుటుంబంలో జన్మించింది. తండ్రి కైలాష్ రాజ్‌ఖోవా ఇంజనీర్ గా పనిచేశాడు. నాగావ్‌లో పాఠశాలలో చదువుకున్న మొలాయ, మెట్రిక్యులేషన్ తర్వాత గౌహతికి వచ్చి, హ్యాండిక్ గర్ల్స్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ ను, గౌహతి యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసింది. కళాశాల రోజుల్లోనే అస్సాం మొదటి మహిళల హాకీ జట్టుకు ఎంపికైంది. తరువాత ఉపధ్యాయ వృత్తిని చేపట్టి, సోనారి కాలేజీలో పనిచేసింది. 1983లో జాగిరోడ్ కాలేజీలో చేరింది.

మొలాయ 1981లో ఇంజనీర్ ప్రదీప్ గోస్వామిని వివాహం చేసుకుంది. వీరికి నిమిషా గోస్వామి, నిషితా గోస్వామి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిషితా గోస్వామి కూడా నటిగా పలు సినిమాలలో నటించింది.[2] [3] 

సినిమారంగం

[మార్చు]

తన భర్త ప్రోత్సాహంతో 1985లో అస్సామీ చిత్ర నిర్మాత దివంగత డాక్టర్ భబేంద్ర నాథ్ సైకియా తీసిన ‘అగ్నిస్నాన్’ సినిమాలో తొలిసారిగా నటించింది. ఈ సినిమా భబేంద్ర నాథ్ సైకియా రాసిన ‘అంతరీప్’ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో మొలాయ గోస్వామి మేనక పాత్రలో నటించింది. 1992 సంవత్సరంలో మొలాయ తన రెండవ సినిమా ‘ఫిరింగోటి’ (అస్సాం జాహ్ను బారువా దర్శకత్వం) లో నటించింది. తరువాత ‘ఉత్తర్‌కాల్’, ‘మా’, ‘అసేన్ కోనోబా హియాత్’, ‘శేష్ ఉపహార్’ సినమాలు చేసింది. ‘రితు అహే రైతు జై’ వంటి అస్సామీ టీవీ సీరియళ్ళలో కూడా నటించింది.

సినిమాలు

[మార్చు]
  • క్యాలెండర్ (2017)
  • భల్ పాబో నజనిలు (2013)
  • పోలే పోలే యురే మోన్ (2011)
  • శ్రీమంత శంకర్దేవ (2010)
  • జీవన్ బాటర్ లోగోరి (2009)
  • కొనికర్ రామ్‌ధేను (రైడ్ ఆన్ ది రెయిన్బో) (2003)
  • డామన్: ఎ విక్టిమ్ ఆఫ్ మారిటల్ వాయిలెన్స్= (2001)
  • ఫిరింగోటి (ది స్పార్క్) (1992)
  • ఉత్తర్కాల్ (1990)
  • సిరాజ్ (1988)
  • సర్బజన్ (1985)
  • మా (1986)
  • అగ్నిస్నాన్ (1985)

పురస్కారాలు

[మార్చు]
  1. 1992: 39వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటిగా ‘రజత్ కమల్’ పురస్కారం (ఫిరింగోటి)
  2. ‘జాయ్‌మోటి అవార్డు’ - ‘ఉత్తమ టీవీ నటి’ (‘రైతు అహే రైతు జై’)

మూలాలు

[మార్చు]
  1. "Delhi to host first festival of films from Assam". India Glitz. 1 January 2006. Archived from the original on 24 September 2015. Retrieved 28 July 2021.
  2. "Nishita Goswami married to Sayan Chakravarty". Assam Journal. Archived from the original on 30 May 2017. Retrieved 28 July 2021.
  3. "Archived copy". Archived from the original on 18 February 2013. Retrieved 28 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

[మార్చు]