మొలాల్ గుట్ట జలపాతం
మొలాల్ గుట్ట జలపాతం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా,ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోని ఖండాల గ్రామపంచాయితీ పరధిలోని మొలాల్ గుట్ట గ్రామానికి అతి సమీపంలో ఉంది. ఖండాల ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే చుపరులను ఇది ఆకట్టుకుంటుంది.[1].
మొలాల్ గుట్ట జలపాతం | |
---|---|
ప్రదేశం | ఖండాల గ్రామపంచాయితీ, ఆదిలాబాద్ గ్రామీణ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ |
రకం | జలపాతం |
మొత్తం ఎత్తు | 50 మీటర్లు |
ఉనికి
[మార్చు]ఈ మొలాల్ గుట్ట జలపాతం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఖండాల గ్రామపంచాయితి పరిధిలోని ఉన్న మొలాల్ గుట్ట గ్రామానికి తుర్పున 1 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలు లోని సింహాద్రి పర్వత శ్రేణుల్లో వస్తుంది.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 325 కి.మీ దూరం,జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇది సుందరమైన ఖండాల లోయ ప్రాంతంలో ఉంటుంది.[2][3].
విశేషాలు
[మార్చు]ఆదిలాబాద్ జిల్లా, ఖండాల గ్రామపచాయితి పరధి లోని మొలాల్ గుట్ట గ్రామానికి అతి సమీపంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం వర్షాకాలంలో అనగా జూలై,ఆగష్టు, సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలకు ఉప్పొంగి ప్రవహించడం వలన జిల్లా వాసులకు పర్యాటకులకు ఆకర్షిస్తుంది. అందాల జిల్లా ఆదిలాబాద్ అడవుల్లో సుందరమైన సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం అపురుపమైన అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆడవులు,గుట్టల ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పూర్వం కుందేళ్ళుకు ఆవాస ప్రాంతంగా ఉండేది అంటారు. అందువలన ఈ జలపాతానికి మొలోల్ గుట్ట,మొలాల్ గుట్ట జలపాతమని పేరు వచ్చింది. మొలోల్ అనగా గోండి భాషలో కుందేళ్ళు అని అర్థం. ఖండాల అందాలు సహజ అందాలకు నెలవు.చుట్టూ పచ్చని అడవులు ఎంతైనా గుట్టలు అందమైన లోయలు నడుమ పర్యాటకులకు కనువిందు చేస్తుంది[4].
మూలాలు
[మార్చు]- ↑ "ఖండాల మోలాల్ గుట్ట వాటర్ ఫాల్స్". www.google.com.pk. Retrieved 2024-06-24.
- ↑ link, Get; Facebook; Twitter; Pinterest; Email; Apps, Other (2024-02-25). "Adilabad Khandala Lohara Hill Station" (in ఇంగ్లీష్). Retrieved 2024-06-24.
{{cite web}}
:|last2=
has generic name (help) - ↑ "కనువిందు చేస్తున్న జలపాతాల అందాలు.. మైమరిచిపోతున్న సందర్శకులు!". News18 తెలుగు. 2023-08-04. Retrieved 2024-06-24.
- ↑ link, Get; Facebook; Twitter; Pinterest; Email; Apps, Other (2024-02-25). "Adilabad Khandala Lohara Hill Station" (in ఇంగ్లీష్). Retrieved 2024-06-24.
{{cite web}}
:|last2=
has generic name (help)