Jump to content

మొహమ్మద్ నయీమ్

వికీపీడియా నుండి
మొహమ్మద్ నయీమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ నయీం షేక్[1]
పుట్టిన తేదీ (1999-08-22) 1999 ఆగస్టు 22 (వయసు: 26)
ఫరీద్‌పూర్, బంగ్లాదేశ్
ఎత్తు6 ft 1 in (185 cm)
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 100)2022 జనవరి 9 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 134)2020 మార్చి 6 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 9 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 67)2019 నవంబరు 3 - ఇండియా తో
చివరి T20I2023 సెప్టెంబరు 6 - Afghanistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019Dhaka Dynamites
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 22 6 43
చేసిన పరుగులు 10 570 183 1,822
బ్యాటింగు సగటు 2.50 27.14 16.63 44.43
100లు/50లు 0/0 0/4 0/1 4/12
అత్యుత్తమ స్కోరు 9 81 65 136
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 9/– 2/– 21/–
మూలం: ESPNcricinfo, 30 August 2022

మొహమ్మద్ నయీమ్ షేక్ (జననం 1999 ఆగస్టు 22) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. అతను 2019 నవంబరులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[2]

దేశీయ కెరీర్

[మార్చు]

2018 ఫిబ్రవరి 22న 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో లెజెండ్స్ ఆఫ్ రూప్‌గంజ్ కోసం నయీమ్ తన తొలి లిస్టు ఎ మ్యాచ్‌ ఆడాడు.[3] దానికి ముందు అతను, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో భాగంగా ఉన్నాడు. [4]

నయీమ్ 2018 అక్టోబరు 15న 2018–19 నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఢాకా మెట్రోపాలిస్‌ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[5] 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ జట్టు తరఫున ఆడాడు.[6] 2019 జనవరి 12న ఢాకా డైనమైట్స్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[7]

2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో 16 మ్యాచ్‌ల్లో 807 పరుగులతో లెజెండ్స్ ఆఫ్ రూప్‌గంజ్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నయీమ్ నిలిచాడు. [8] 2019 ఆగస్టులో, బంగ్లాదేశ్ 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో పేరున్న 35 మంది క్రికెటర్లలో అతను ఒకడు. [9] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రేంజర్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [10]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ ఎంపికయ్యాడు. [11] 2021 డిసెంబరులో, అతను న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. [12] అతను బంగ్లాదేశ్ తరపున 2022 జనవరి 9న న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అడుగుపెట్టాడు.[13]

2019 నవంబరులో, బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ ఎంపికయ్యాడు. [14] అదే నెలలో, 2019 దక్షిణాసియా క్రీడలలో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [15] బంగ్లాదేశ్ జట్టు ఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. [16]

2020 ఫిబ్రవరిలో, జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో నయీమ్‌ని చేర్చారు. [17] అతను 2020 మార్చి 6న జింబాబ్వేపై బంగ్లాదేశ్ తరపున తన ODI రంగప్రవేశం చేసాడు [18]

2019 సెప్టెంబరులో, 2019-20 బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్‌లో చివరి రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20Iలు) జట్టుకు ఎంపికయ్యాడు గానీ, అతను సిరీస్‌లో ఆడలేదు. [19] 2019 అక్టోబరులో, భారత్‌తో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ T20I జట్టులో ఎంపికయ్యాడు. [20] 2019 నవంబరు 3న బంగ్లాదేశ్ తరపున భారతదేశంతో జరిగిన మ్యాచ్‌లో T20I రంగప్రవేశం చేసాడు [21]

ఆడిన జట్లు

[మార్చు]

నయీం వివిధ సందర్భాల్లో బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ U23, బంగ్లాదేశ్ U19, బంగ్లాదేశ్ A, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ XI, ఢాకా డైనమైట్స్, రంగ్‌పూర్ రేంజర్స్, బెక్సిమ్‌కో ఢాకా, మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్లలో . [22]

మూలాలు

[మార్చు]
  1. "ICC U19 World Cup: South African బౌలరుs Lead Demolition Job Against Bangladesh". News18. 31 January 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2018.
  2. "Mohammad Naim". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2018.
  3. "26th match, Dhaka Premier Division Cricket League at Dhaka, Feb 22 2018". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 February 2018.
  4. "Media Release : ICC Under 19 Cricket World Cup 2018: Bangladesh squad announced". Bangladesh Cricket Board. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 December 2017.
  5. "Tier 2, National Cricket League at Bogra, Oct 15-18 2018". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 October 2018.
  6. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2018.
  7. "12th Match (D/N), Bangladesh Premier League at Dhaka, Jan 12 2019". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2019.
  8. "Dhaka Premier Division Cricket League, 2018/19 - Legends of Rupganj: Batting and bowling averages". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2019.
  9. "Mohammad Naim, Yeasin Arafat, Saif Hassan - A look into Bangladesh's future". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 August 2019.
  10. "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2019.
  11. "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 September 2021.
  12. "Shakib Al Hasan picked for New Zealand Tests despite not wanting to travel". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2021.
  13. "2nd Test, Christchurch, Jan 9 - 13 2022, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2022.
  14. "Media Release : Bangladesh squad for Emerging Teams Asia Cup 2019 announced". Bangladesh Cricket Board. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2019.
  15. "Media Release : Bangladesh U23 Squad for 13th South Asian Game Announced". Bangladesh Cricket Board. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 November 2019.
  16. "South Asian Games: Bangladesh secure gold in men's cricket". BD News24. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 December 2019.
  17. "Afif Hossain and Mohammad Naim break into Bangladesh ODI squad". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 February 2020.
  18. "3rd ODI (D/N), Zimbabwe tour of Bangladesh at Sylhet, Mar 6 2020". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 March 2020.
  19. "Bangladesh include uncapped Mohammad Naim, Aminul Islam for next two T20Is". Cricbuzz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 September 2019.
  20. "Arafat Sunny, Al-Amin Hossain, Tamim Iqbal back in Bangladesh squad". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2019.
  21. "1st T20I (N), Bangladesh tour of India at Delhi, Nov 3 2019". ESPN Cricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 November 2019.
  22. "Mohammad Naim". Shamim Nesco. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2022.