మొహమ్మద్ ఫరూక్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | జునాగఢ్, గుజరాత్, బ్రిటిష్ ఇండియా | 1938 ఏప్రిల్ 8|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 37) | 1960 డిసెంబరు 2 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1965 ఏప్రిల్ 9 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 9 July 2017 |
మొహమ్మద్ ఫరూక్ (జననం 1938, ఏప్రిల్ 8) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు. 1960 - 1965 మధ్యకాలంలో ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
క్రికెట్ కెరీర్
[మార్చు]ఫరూక్ 1960లలో పాకిస్థాన్ ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.[1] 1959-60లో మొదటి సీజన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ పేరును సంపాదించాడు. తన మూడవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో 87 పరుగులకు 6 వికెట్లు (6/87), 5/98 లతో క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్‌లో కరాచీని గెలిపించాడు.[2] 1960/61లో పాకిస్తాన్ జట్టుతో కలిసి భారతదేశ పర్యటనకు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌లో ఆడి మొదటి మూడు భారత వికెట్లు తీశాడు. 46 ఓవర్లలో 4/139తో ముగించాడు.[3] అయితే, పాకిస్తాన్ అతని స్థానంలో ఒక బ్యాట్స్‌మెన్‌ని రెండో టెస్టుకు తీసుకుంది. ఇతను ఐదవ టెస్టులో రెండు వికెట్లు తీసేవరకు తిరిగి జట్టులోకి రాలేదు.[4]
1962 లో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. ప్రారంభ కౌంటీ మ్యాచ్‌లలో విజయవంతమయ్యాడు, లార్డ్స్‌లో జరిగిన రెండవ టెస్ట్‌కు జట్టులో చేర్చబడినప్పుడు 4/70 తీసుకున్నాడు.
రెండు సంవత్సరాలకు పైగా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేదు, కానీ 1964/65 సీజన్‌లో తిరిగి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌ను కనబరిచిన తర్వాత పర్యాటక న్యూజిలాండ్‌లతో జరిగిన టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇరువైపులా అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు, ఒక్కో వికెట్‌కు 25.30 పరుగుల సగటుతో 10 వికెట్లు తీశాడు. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టులో 2/57, 3/25 తీసుకున్నాడు. పాకిస్తాన్ 9 వికెట్లకు 253 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వెళ్ళి, 47 పరుగులు చేశాడు.[5][6] పాకిస్తాన్ 2-0తో గెలిచిన సిరీస్‌లోని మూడవ టెస్ట్ తర్వాత, ఇక ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడలేదు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Christopher Martin-Jenkins, The Complete Who's Who of Test Cricketers, Rigby, Adelaide, 1983, p. 469.
- ↑ "Karachi v Lahore 1959-60". CricketArchive. Retrieved 10 July 2017.
- ↑ "India v Pakistan, Bombay 1960-61". CricketArchive. Retrieved 10 July 2017.
- ↑ "Pakistan in India, 1960-61", Wisden 1962, pp. 854-63.
- ↑ "New Zealand in India and Pakistan, 1964-65", Wisden 1966, pp. 902-6.
- ↑ "Pakistan v New Zealand, Rawalpindi 1964-65". CricketArchive. Retrieved 10 July 2017.
- ↑ "Mohammad Farooq". Cricinfo. Retrieved 11 March 2021.