మోనిక (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోనిక (అలియాస్) ఎం.జి.రహీమా
దస్త్రం:Monica (a) M. G. Rahima.JPG
జననం
రేఖ

(1987-08-25) 1987 ఆగస్టు 25 (వయసు 36)
ఇతర పేర్లుమోనిక,రేఖ,పర్వన,ఎం.జి.రహీమా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990–1995; 2001–2014
జీవిత భాగస్వామిమాలిక్ (2015-ప్రస్తుతం)
తల్లిదండ్రులుమారుతి రాజ్, గ్రేసీ

మోనిక (జననం రేఖ మారుతీరాజ్)[1] భారతీయ సినిమా నటి. ఆమె తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించారు. 1990లలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసారు. 2000లలో ఆమె సహాయనటిగా ఎక్కువగ నటించారు. ఆమె "ఆజాగి", ఇంసాయి అరాసన్ 23ఎం పులికేశి, సిలాంధి చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు. 2012లో ఆమె తన పేరును మలయాళ చిత్రాల కోసం "పర్వాణ"గా మార్చుకున్నారు.[2] 2014లో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి ఆమె పేరును ఎం.జి.రహీమాగా మార్చుకున్నారు. ఆ తరువాత చిత్రసీమ నుండి నటిగా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.I[3] చిన్న వయసులోనే బాలనటిగా మొదలుపెట్టి నాయిక పాత్రల దాకా ఎదిగిన మోనిక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 దాకా చిత్రాల్లో నటించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె మే 30 2014ఇస్లాం మతం తీసుకున్నారు. పత్రికా సమావేశంలో ఆమె "బాల నటిగా మొదలైన నేను ఇన్నేళ్ళుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు’’ అని ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ‘‘డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో నేను మతం మార్చుకోలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారాను’’ అని మోనిక వివరించారు. పెళ్ళి గురించి వివరాలను త్వరలోనే చెబుతానని ఆమె అన్నారు.[4] Monika’s father is Hindu and the mother is a Christian.[5]

తెలుగు చిత్రసీమలో[మార్చు]

వెంకటేశ్ సూపర్ హిట్ ‘చంటి’ (1991)లో, తమిళ ‘సతీ లీలావతి’ (’95)లో బాల నటిగా చేసిన మోనిక పెద్దయ్యాక తెలుగులోశివరామరాజు’, ‘మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]