Jump to content

మోర్మన్ మతం

వికీపీడియా నుండి
(మోర్మన్ నుండి దారిమార్పు చెందింది)
బుక్ ఆఫ్ మోర్మన్ పుస్తకానికి మొదటి ప్రచురణకు పునర్ముద్రణ (1830)

మోర్మనిజం అనేది పునరుద్ధరణ వాద క్రైస్తవం (రిస్టోరియన్ క్రిస్టియానిటీ)కి చెందిన లేటర్ డే సెయింట్ ఉద్యమంలో ప్రధానమైన మత సంప్రదాయం. ఉద్యమాన్ని అప్ స్టేట్ న్యూయార్క్ కి చెందిన జోసెఫ్ స్మిత్ 1820లో ప్రారంభించారు. 1830, 1840లలో సంప్రదాయకమైన ప్రొటెస్టెంటిజం నుంచి మోర్మనిజం విడివడింది. ప్రస్తుతం మోర్మనిజం 1840ల్లో స్మిత్ బోధించిన కొత్త, నాన్-ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. స్మిత్ మరణం తర్వాత బ్రిగామ్ యంగ్ ను అనుసరిస్తూ తమని  తాము చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్.డి.ఎస్. చర్చ్)గా పిలుచుకోవడం ఆరంభించారు. ఎల్.డి.ఎస్. చర్చిలో భాగంగాని వివిధ రూపాల్లో బహుభార్యాత్వ విధానాలు, సిద్ధాంతాలు కొనసాగాలని ఆశించే మోర్మన్ ఫండమెంటలిజం వంటివి కూడా ఉన్నాయి.[1] అలాంటి సిద్ధాంతాలను ఎల్.డి.ఎస్. చర్చ్, మరికొన్ని ఇతర చిన్న స్వతంత్ర శాఖలు వదిలేశాయి.[2]

మోర్మన్ అన్న పదం మొట్టమొదట ఈ విశ్వాసానికి సంబంధించిన మతపరమైన గ్రంథం బుక్ ఆఫ్ మోర్మన్ నుంచి స్వీకరించారు. ఈ పుస్తకం పేరును అనుసరించి. ఈ పుస్తకం పేరును ఆధారంగా చేసుకుని స్మిత్ అనూయాయులను మోర్మన్లు అనీ, వారి విశ్వాసాన్ని మోర్మనిజం లేదా మోర్మన్ మతం అని పిలిచారు. మొదట్లో ఈ పదం అవమానకరమైనదిగా భావించేవారు,[3] కానీ ప్రస్తుతం మోర్మన్లు అలా పరిగణించట్లేదు (ఏదేమైనా లేటర్ డే సెయింట్, లేదా ఎల్.డి.ఎస్. అని పిలిపించుకుందుకే సాధారణంగా ఇష్టపడతారు).[4]

బైబుల్ ని విశ్వసించడం, ఉపయోగించడంతో పాటుగా బుక్ ఆఫ్ మోర్మన్ వంటి మతపరమైన గ్రంథాలను విశ్వసించడం వంటివాటిలో మోర్మన్ మతం ఇతర లేటర్ డే సెయింట్ ఉద్యమంతో సాధారణమైన విశ్వాసాలను పంచుకుంటోంది. మోర్మన్ మతం పెర్ల్  ఆఫ్ గ్రేట్ ప్రైస్ గ్రంథాన్ని అంగీకరిస్తోంది, సెలెస్టియల్ వివాహాలు, ఎటర్నల్ ప్రొగ్రేషన్, బహుభార్యాత్వం  వంటివాటి చరిత్ర కలిగివుంది,  ఏదేమైనా ఎల్.డి.ఎస్. చర్చ్ అధికారికంగా  1890ల్లో బహుళ వివాహాలు,  బహు భార్యాత్వం అనే విధానాన్ని విడిచిపెట్టింది.  సాంస్కృతిక మోర్మనిజంలో మోర్మన్సంస్థలు ప్రాచుర్యం చేసిన జీవన విధానం  కలిగివుంటుంది.  సాంస్కృతిక మోర్మన్లు  అంటే మత సిద్ధాంతాలతో ఆ సంస్కృతితో తమను తాము గుర్తించేవారు.

సంక్షిప్త చరిత్ర

[మార్చు]
జోసెఫ్ స్మిత్ ఓ తోటలో దర్శనం పొందిన ఫస్ట్ విజన్ సంఘనను చిత్రించిన గాజు కిటికీ

1820ల్లో రెండవ గొప్ప జాగృతి (సెకండ్ గ్రేట్ ఎవేకనింగ్) అనే మతపరమైన ఉత్తేజపు కాలంలో పశ్చిమ న్యూయార్క్ ప్రాంతంలో మోర్మనిజం ఆవిర్భవించింది.[5] స్మిత్ వర్ణించినదాని ప్రకారం 1820 వసంత కాలంలో తన ప్రార్థనకు సమాధానంగా తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని దర్శించాడు,[6] దీన్నే ఫస్ట్ విజన్ లేదా మొదటి దర్శనంగా పేర్కొంటారు, తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని స్మిత్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా దర్శించడంతోనే దేవుని స్వభావం గురించి మోర్మనిజం  దృక్పథం, సంప్రదాయ క్రైస్తవం దృక్పథాల నడుమ సైద్ధాంతిక భేదం  ప్రారంభమైపోయిందని చెప్తారు. దీంతో పాటుగా స్మిత్ తన ప్రార్థనకు  సమాధానంగా దేవుడు ప్రస్తుతం ఉన్న ఏ చర్చిలోనూ చేరవద్దని ఆదేశించినట్టూ ఎందుకంటే అవన్నీ తప్పని చెప్పినట్టు పేర్కొన్నారు.[7] 1820ల్లో స్మిత్ పలువురు దేవదూతలు సందర్శించినట్టుగా  నివేదించారు, నిజమైన క్రైస్తవ చర్చిని తిరిగి  నెలకొల్పేందుకు తనను వినియోగించుకుంటానని దేవుడు  ఆదేశించినట్టు, బుక్ ఆఫ్ మోర్మన్ పునరుద్ధరణ పొందే ఆ చర్చికి సరైన  సిద్ధాంతాన్ని నెలకొల్పే మార్గమని అన్నట్టు 1830ల నాటికి వివరించారు.

మోరోనీ అనే దేవదూత దారిచూపగా తాను పాతిపెట్టివున్న గోల్డెన్ ప్లేట్స్ ను బుక్ ఆఫ్ మోర్మన్ అనువాదాన్ని జోసెఫ్ స్మిత్ చెప్తూండగా రాసేవారు. కొత్తగా జోసెఫ్ స్మిత్ కనిపెట్టిన ఈ మతం కొందరు తొలినాళ్ళ విశ్వాసులను ఆకర్షించడం ప్రారంభించింది. తొలినాళ్ళ అమెరికా ఆదిమవాసులను క్రానికల్ గా బుక్ ఆఫ్ మోర్మన్ తనను తాను అభివర్ణించుకుంది, క్రీస్తు జననానికి అనేక వందల సంవత్సరాల క్రితమే విశ్వసించిన ఇజ్రాయెలీలుగా వారిని ఈ గ్రంథం చిత్రీకరించింది. స్మిత్ మూడు నెలల్లో 584 పేజీలను డిక్టేట్ చేశారు[8] తాను భగవంతుడి శక్తి, బహుమతుల ద్వారా ఓ ప్రాచీన భాష నుంచి దాన్ని అనువదించానని చెప్పారు.[9] 1829 మధ్యభాగంలో ఈ పుస్తకం తయారవుతుండగా ఆలీవర్ కౌడెరీ సహచరులు, తర్వాతికాలంలో 1830లో అధికారికంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గా ఏర్పాటైన, క్రిస్టియన్ ప్రిమిటివిస్ట్ చర్చ్ లోకి బాప్తిజం చేయించారు.[10] ఆధునిక దినపు ప్రవక్తయైన స్మిత్ తో కలిపి మొత్తంగా ఏడుగురు విశ్వాసులు ఉండేవారు.[11]

న్యూయార్క్ వాసులతో ఘర్షణ తప్పించుకునేందుకు ఈ మతశాఖ అనుయాయులు ఓహియోలోని కిర్ట్లాండ్ కు తరలిపోయారు, ముస్సోరీలోని జాక్సన్ కౌంటీలో న్యూ జెరూసలెం లేదా సిటీ ఆఫ్ జియోన్ ను శాశ్వతంగా నిర్మించుకోవాలని ఆశించారు.[12]  ఏదేమైనా 1833లో వాళ్ళను జాక్సన్ కౌంటీ నుంచి తరిమేయగా 1838 తొలినాళ్ళలో కిర్ట్లాండ్ కు పారిపోయారు. ముస్సోరీలో ఇతర మిషనరీలతో హింసాత్మకమైన ఘర్షణల ఫలితంగా ముస్సోరీ గవర్నర్ లేటర్ డే సెయింట్స్ ను ముస్సోరీ నుంచి బహిష్కరించే ఎక్స్టెర్మినేషన్ ఆర్డరు జారీచేశాడు. తమ నెలవులు కోల్పోయిన మోర్మన్లు ఇల్లినియాస్, సెటటర్ ated to the point that in 1844, Smith was killed by a mob, precipitating a succession crisis.[13] The largest group of Mormons (LDS Church) accepted Brigham Young as the new prophet/leader and emigrated to what became the Utah Territory.[14] There, the church began the open practice of plural marriage, a form of polygyny which Smith had instituted in Nauvoo. Plural marriage became the faith's most sensational characteristic during the 19th century, but vigorous opposition by the United States Congress threatened the church's existence as a legal institution. In his 1890 Manifesto, church president Wilford Woodruff announced the official end of plural marriage.[15]

మూలాలు

[మార్చు]
  1. For a discussion on a history of Mormon polygamy, see Plural Marriage in The Church of Jesus Christ of Latter-day Saints, The Church of Jesus Christ of Latter Day Saints
  2. The second-largest Latter Day Saint denomination, the Reorganized Church of Jesus Christ of Latter-day Saints, since 2001 called "Community of Christ", does not describe itself as Mormon, but instead follows a Trinitarian Christian restorationist theology, and also considers itself Restorationist in terms of Latter-day Saint doctrine.
  3. Terms used in the LDS Restorationist movement Archived 2017-11-14 at the Wayback Machine ReligiousTolerance.org
  4. M. Russell Ballard (October 2011), The Importance of a Name 
  5. Bushman (2008, p. 1); Shipps (1985, p. 36); Remini (2002, p. 1).
  6. Bushman (2008, p. 16)
  7. Smith's 1838 written account of this vision was later canonized in a book called the The Pearl of Great Price.
  8. Bushman (2008, p. 22)
  9. History of the Church 1:315; Bushman (2008, p. 21).
  10. Remini (2002, pp. 63, 79)
  11. Bushman (2008, p. 8)
  12. Bushman (2008, p. 10)
  13. Bushman (2008, pp. 12–14)
  14. Bushman (2008, p. 13)
  15. Bushman (2008, p. 2); "Official Declaration 1". lds.org.