అమెరికా ఆదిమ వాసులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అమెరికా ఖండాన్ని కొలంబస్ కనుగొనడానికి పూర్వమే అక్కడ అనేక తెగల ఆదిమ వాసులు నివసించే వారు. భారత దేశాన్ని చేరడం కోసం యూరోపు నుండి కొత్తగా పశ్చిమ ప్రయాణం మొదలుపెట్టిన కొలంబస్ ఈ భూమినే ఇండియా అనుకొని, ఈ తెగలవారిని 'ఇండియన్స్' అని పిలిచాడు. అందువల్ల వీరిని ఎర్ర భారతీయులు (రెడ్ ఇండియన్స్) అని కూడ వ్యవహరించేవారు.

వీరిలో అనేకులు ఐరోపా దేశస్థుల సాంగత్యం వలన, వారి నుంచి సోకిన కొత్త వ్యాధుల వలన చనిపోయారు. కొన్ని తెగలు యుద్ధంలో దాదాపు పూర్తిగా నశించాయి. మరి కొందరు యుద్ధాలలో ఓడి బానిసలుగా ఐరోపా వారి దగ్గర లొంగిపోయారు. కుదిరినప్పుడు యుద్ధాలు, లేనప్పుడు ఒప్పందాల మూలంగా ఐరోపా దేశస్థులు (ముఖ్యంగా ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్పెయిన్ వారు) ఈ జాతులను తెగలను, క్రమంగా మొత్తం అమెరికా ఖండ భూభాగాన్నంతా క్రీ.శ. 15 వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం లోపల పూర్తిగా ఆక్రమించు కున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం , అమెరికా, కెనడా లలో కలిపి మొత్తం దాదాపు 30 లక్షల మంది ఆదిమ వాసుల అను వంశీకులుంటారు. వీరి పూర్వీకులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి అమెరికాకు వచ్చి చేరారని (బహుశా అలాస్కా ఆసియా తో కలిసి ఒకే భూ భాగంగా ఉండేటప్పుడు ), మానవ శాస్త్ర పరిశోధనల్లో తేలింది.

ఆదిమ ఉత్తర అమెరికన్ల లో కొన్ని ముఖ్య తెగలు = చెరోకీ, మాయా/యుకాటెక్, అజ్ టెక్, నవాజో, స్యూ మొదలయినవి. ఈ తెగల పేర్లే భాషలకి కూడా వర్తిస్తూంటారు.