మోర్మన్ మతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

క్రీ. శ. 1820 సంవత్సరంలో ఎగువ న్యూయార్క్ రాష్ట్రంలో దేవదూతలను చూసినట్లు ప్రకటించుకున్న జోసఫ్ స్మిత్ ను, యేసు క్రీస్తు తరువాత వచ్చిన ప్రవక్త గా విశ్వసించే మతవాదాన్ని 'పునరుద్ధారక క్రైస్తవ మతం' (Restoratory Christianism) అంటారు. క్రమేణా ఇతర ప్రవక్తలు కూడా చేరి,'తదుపరి నాటి పునీతోద్యమం' (Latter Day Saints Movement) అని పేరు తెచ్చుకుంది. దీని ప్రధాన శాఖ మోర్మన్ మతము. ఈ మతం అనేక దేశాలకు వ్యాపించినప్పటికీ అమెరికా లోని యూటా (Utah) రాష్ట్రంలో ప్రధానంగా కేంద్రీకృతమైయుంది.

చరిత్ర[మార్చు]

ఈ మతం పాటించేవారు వారి చరిత్ర, బోధనల అనుసారం బలమైన కుటుంబ, సామాజిక బంధాలు నిలుపుకుంటారు. వీరు బైబిల్ తో పాటు మోర్మన్ గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు. తాము క్రైస్తవులమేనని వీరు చెప్పుకుంటున్నప్పటికీ వీరి ఆచార వ్యవహార భేదాలవల్ల ఇతర క్రైస్తవులు అనేకులు వీరిని క్రైస్తవులుగా పరిగణించరు. ఈ మతం మొదట్లో బహుభార్యాత్వం అనుమతించి, ప్రోత్సాహించేది, కాని 1890 నుండి, క్రమంగా ఈ ఆచారం తగ్గుముఖం పట్టి, 1915 నాటికి పూర్తిగా అంతరించింది.

యివి కూడా చూడండి[మార్చు]

అమెరికా అధ్యక్షునిగా 2012 లో పోటీ చేసి ఒబామా చేతిలో ఓటమి చవి చూసిన మిట్ రోమ్నీ మోర్మన్ మతస్థుడే. క్రైస్తవుడని పరిగణించకపోవడం వల్ల కోల్పోయిన మద్దతు కూడ దీనికి కారణమయిందని ఒక అభిప్రాయం.

సూచికలు[మార్చు]

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.