మో అబుటోక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మో అబుటోక్
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

మో అబుటోక్ స్కాటిష్ సినిమా దర్శకుడు, నిర్మాత. రివర్ సిటీ అనే స్కాటిష్ టెలివిజన్ సిరీస్ కు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 2014 నుండి బిబిసి స్కాట్లాండ్ కోసం అనేక ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు.[1][2]

సినిమారంగం[మార్చు]

2015లో డేవిడ్ హేమాన్ జూనియర్ తో కలిసి 'వేస్ట్ టైమ్' అనే సినిమాకు సహ దర్శకత్వం వహించాడు.[3] స్కాటిష్ నటుడు డేవిడ్ హేమాన్ నటించిన ఈ చిత్రం £12,000 బడ్జెట్ తో పక్షంరోజులపాటు చిత్రీకరించబడింది. షూటర్ ఫిల్మ్స్ కోసం మొదటి ఫీచర్ గా గుర్తించబడింది.[4] 2015 గ్లాస్గో ఫిల్మ్ ఫెస్టివల్ లో వేస్ట్ టైమ్ సినిమా ప్రపంచ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది.[5][6] 2017లో బిబిసి పిల్లల కార్యక్రమం రావెన్ కి డైరెక్టర్ గా నియమించబడ్డాడు.[7]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత ఎడిటర్ నటుడు ఇతర వివరాలు
2009 వేస్టెడ్ ఈపీకే బృందం
2010 లిటిల్ గ్రీన్ బ్యాగ్ Yes Yes Yes షార్ట్ ఫిల్మ్
2011 నర్సరి చైమ్స్ Yes షార్ట్ ఫిల్మ్
2014 వేస్టెడ్ టైమ్ Yes Yes డేవిడ్ హేమాన్ జూనియర్ తో కలిసి దర్శకత్వం వహించిన లఘు చిత్రం

టెలివిజన్[మార్చు]

సంవత్సరం. పేరు పాత్ర ఇతర వివరాలు
2014 రివర్ సిటీ దర్శకుడు 2 భాగాలు
2017 రావెన్ దర్శకుడు 15 భాగాలు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]