అక్షాంశ రేఖాంశాలు: 35°39′25.8″N 82°51′56.0″W / 35.657167°N 82.865556°W / 35.657167; -82.865556

మౌంట్ సోమేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌంట్ సోమేశ్వర దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:నార్త్ కరోలినా
ప్రదేశం:సోమ పర్వతం, బ్లూరిడ్జ్ పర్వతాలు
అక్షాంశ రేఖాంశాలు:35°39′25.8″N 82°51′56.0″W / 35.657167°N 82.865556°W / 35.657167; -82.865556

మౌంట్ సోమేశ్వర దేవాలయం, అమెరికా నార్త్ కరోలినాలోని బ్లూరిడ్జ్ పర్వతాలలోని సోమ పర్వతం మధ్యలో ఉన్న ఒక హిందూ దేవాలయం. 2011లో 435 ఎకరాలలో స్థాపించబడిన మౌంట్ సోమ సెంటర్‌లో వేద వాస్తు సంస్థలో ఈ దేవాలయం ఉంది.[1][2] దీనిని సాధారణంగా "పశ్చిమ కైలాష్ పర్వతం" అని పిలుస్తారు. సోమేశ్వరుని శక్తివంతమైన లింగాన్ని దర్శించడానికి భక్తులు అనేకమంది ఇక్కడికి వస్తారు.[3]

చరిత్ర

[మార్చు]

2006 నుండి సోమేశ్వరాలయ నిర్మాణం గురించి ప్రణాళికలు జరిగాయి. వాస్తు నిర్మాణాన్ని ఉపయోగించి 46 టన్నుల చేతితో చెక్కిన భారతీయ గ్రానైట్ తో ఈ దేవాలయాన్ని నిర్మించారు.[4][5] దేవాలయ ప్రాంగణంలో చేతితో చెక్కబడిన నల్ల గ్రానైట్ నవగ్రహాలు (తొమ్మిది గ్రహాలు), 20 అడుగుల హనుమంతుని విగ్రహం ఉన్నాయి.[2] ఐదు రోజుల ఉత్సవాల అనంతరం 2011 మే 16న సోమేశ్వరాలయం ప్రతిష్ఠాపన జరిగింది.

నిర్మాణ వివరాలు

[మార్చు]

2007లో దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2007 వసంతకాలంలో దేవాలయ రూపకల్పనలో సహకారం కోసం భారతదేశానికి వచ్చారు. డిజైన్ పూర్తయిన తర్వాత శిల్పి కళాకారులు దేవాలయ నిర్మాణానికి కావలసిన రాయిని సేకరించి, టెంపుల్ ఆర్చ్‌వే రాయిని చెక్కారు. 2008 మే నెలలో 46 టన్నుల గ్రానైట్ శిల్పాలను పడవలో రెండు కంటైనర్లలో (మొత్తం 146 డబ్బాలు) చెన్నై నుండి పశ్చిమ ఉత్తర కరోలినాలోని దేవాలయ ప్రదేశానికి పంపించారు. 2009 జూలై 23న దేవాలయ పునాది వేయబడింది. 2010 చివరినాటికి నిర్మాణం పూర్తయింది.[6]

కుంబాభిషేకం

[మార్చు]
  • 2010 అక్టోబరు 27: భూమి పూజ & పంచశీలాన్యాసం (5 రాళ్లు, విలువైన రత్నాలు, నవ ధాన్యాల గింజల పునాది, సంస్థాపన)
  • 2010 నవంబరు 3: గర్భన్యాసం (లోపలి గర్భగుడిలోని ప్రతి స్తంభం క్రింద రత్నాల పలకలు, 5 లోహాలను ఉంచి, స్తంభాలను స్థాపించారు)
  • 2010 డిసెంబరు: ప్రథమేష్టిక (శివాలయం పైన చివరి భాగాన్ని అమర్చారు)
  • 2010 నవంబరు: ధాన్యతి వాసం (అన్నంలో దేవతలను ఉంచారు)
  • 2011 మార్చి 16: జలతి వాసం (దేవతలను నీటిలో ఉంచారు)
  • 2011 ఏప్రిల్ 10: ద్వారా స్థాపన (ద్వారాన్ని స్థాపించారు, కుంబాభిషేకం వేడుకలు)
  • 2011 మే 15: అష్ట బంధన ప్రతిష్ఠ (శివలింగాన్ని ప్రతిష్ఠ)
  • 2011 మే 15: నయనోన్మీలనం (దేవతామూర్తుల ఉత్సవం)
  • 2011 మే 16: కలశ స్థాపన (దేవాలయ నిర్మాణం పైన కలశాన్ని అమర్చారు, దేవాలయ ప్రతిష్ఠాపనకు ముందు శిల్పులు నిర్వహించే చివరి వేడుక)

ఇతర సదుపాయాలు

[మార్చు]

ఇక్కడ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమాలు, వేద వెల్నెస్ సెంటర్, ఉద్యానవనాలు, వేదాల అధ్యయనం వంటివి ఉన్నాయి.[7]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Forum on Religion – Consecration of Srī Somesvara Temple". Yale University.
  2. 2.0 2.1 Harrell, Shelby (June 5, 2014). "Hanuman Has Arrived". The Mountaineer. Retrieved 2022-04-01.
  3. "Introduction to Sri Somesvara Temple | Sri Somesvara Temple". Archived from the original on 2021-05-15. Retrieved 2022-04-01.
  4. "Sri Somesvara Temple, Mount Soma, North Carolina". K&SK Architects.
  5. "Broadcast about Sri Somesvara, Mount Soma & Michael Mamas". TV Asia. January 24, 2016.
  6. "History | Sri Somesvara Temple". Archived from the original on 2021-04-13. Retrieved 2022-04-01.
  7. "Mount Soma's Vision". www.mountsoma.org. Retrieved 2022-04-01.