మౌనా కియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌనా కియా
Mauna Kea
Mauna a Wākea
కాలానుగుణ మంచు టోపీ తో మౌనా కియా
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు4,207.3 m (13,803 ft)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్4,207.3 m (13,803 ft)
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్3,947 km (2,453 mi)

మౌనా కియా హవాయి ద్వీపంలో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 4,207 మీటర్లు. దీని శిఖరం హవాయ్ రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశం. ఈ పర్వతంలో ఎక్కువ భాగం నీటిలో మునిగి ఉంది. మహా సముద్రంలో మునిగి ఉన్న పర్వత పాదం నుండి కొలిచినప్పుడు, మౌనా కియా ఎత్తు 10,000 మీటర్లకు పైనే ఉంటుంది, అంటే దీని దిగువ భాగం నుండి శిఖరం వరకు గల ఎత్తును తీసుకుంటే, ఇది ఎవరెస్టు పర్వతాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమవుతుంది.

మౌనా కియా చివరిగా 6,000 నుంచి 4,000 సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్రాణంగానే ఉందని భావిస్తారు. హవాయి పురాణాల ప్రకారం హవాయ్ దీవులలోని శిఖరాలు పవిత్రమైనవి, మౌనా కియా వీటన్నింటిలోకి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మౌనా కియా పర్వత వాలులో నివసిస్తున్న ప్రాచీన హవాయివాసులు ఆహారం కోసం దానిపై ఉన్న అడవులపై ఆధారపడుతున్నారు. యూరోపియన్లు 18 వ శతాబ్దంలో వచ్చినప్పుడు, స్థిరపడినవారు పశువులూ గొర్రెలను, వేట జంతువులనూ ప్రవేశ పెట్టారు. వీటిలో చాలా పెంపుడు జంతువులు అవడంతో ఇక్కడ పర్వత జీవావరణం దెబ్బతినడం ప్రారంభమైంది. గత కొన్ని సంవత్సరాలుగా హవాయి ప్రభుత్వ భూమి, సహజ వనరుల శాఖ పర్వతం మీద పెంపుడు జంతువుల జాతులను నిర్మూలించేందుకు వాటిని పెంచే స్థానికులపై కేసులు పెట్టసాగింది.

మౌనా కియా శిఖరపు అధిక ఎత్తు, అక్కడి పొడి వాతావరణం, స్థిరమైన గాలి వలన ఈ శిఖరాగ్రం ఖగోళ పరిశోధనలకు ప్రపంచంలోని అత్యుత్తమ సైట్లలో ఒకటిగా మారింది. 1964 లో శిఖరం పైకి ఒక దారి ఏర్పాటైన తరువాత, పదకొండు దేశాలు సమకూర్చిన నిధులతో పదమూడు టెలిస్కోపులను ఈ శిఖరంపై నిర్మించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మౌనా_కియా&oldid=2968327" నుండి వెలికితీశారు