Jump to content

మౌనిక యాదవ్

వికీపీడియా నుండి
(మౌనిక యాదవ్‌ నుండి దారిమార్పు చెందింది)
మామిండ్ల మౌనిక యాదవ్
మౌనిక యాదవ్


పదవీ కాలం
2014 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 20 జూన్
కనపర్తి
వీణవంక మండలం
కరీంనగర్ జిల్లా
తెలంగాణ
తల్లిదండ్రులు మల్లయ్య, శ్యామల
నివాసం హైదరాబాదు, తెలంగాణ

మామిండ్ల మౌనిక యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. ఆమె జానపద పాటలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకొని 2021లో పుష్ప సినిమాలో ‘సామీ.. సామీ..’ పాట ద్వారా మంచి గుర్తింపునందుకుంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మౌనిక యాదవ్ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కనపర్తి గ్రామంలో మల్లయ్య, శ్యామల దంపతులకు జన్మించింది. ఆమె ఆరవ తరగతి వరకు కనపర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి, కుటుంబం జమ్మికుంటలో స్థిర పడడంతో ఏడవ తరగతి నుండి డిగ్రీ వరకు జమ్మికుంటలో పూర్తి చేసింది.

వృత్తి జీవితం

[మార్చు]

మౌనిక యాదవ్ అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. ఆమె తన అక్క పాటలు పాడేందుకు వెళుతుంటే తన వెంట వెళ్తూ అక్కను అనుసరిస్తూ, అమ్మానాన్నల ప్రోత్సాహంతో క్రమంగా పాటలు పడడంపై ఇష్టం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం సమయంలో 2009లో కనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమంలో ‘గోదారి గోదారీ ఓహో పారేటి గోదారీ.. సుట్టూ నీళ్లువున్న సుక్కాదక్కని ఎడారి ఈ భూమీ.. మాదీ తెలంగాణ భూమీ’ అనే ఉద్యమగీతం పాట ద్వారా గాయనిగా తొలిసారి ఆమెకు అవకాశం దక్కింది, అలా తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తిరిగి అనేక పాటలు పడింది. మౌనికకు 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక '‘తెలంగాణ సాంస్కృతిక సారథి'’లో ఉద్యోగం వచ్చింది.

మౌనిక యాదవ్ తొలిసారిగా మానుకోట ప్రసాద్ తొలిసారిగా ‘మానుకోట పాటలు’ చానెల్‌ కోసం పడిన జానపద పాట ‘కట్టమీద కూసున్నాడే సక్కని సూపుల సిన్నోడే’ యూ ట్యూబ్‌లో విడుదలైంది, అలా సైటీవీలో పడిన ‘రాములో రాములా’ పాట ద్వారా 100 మిలియన్ల వ్యూస్‌ అందుకొని జానపద గాయనిగా మంచి గుర్తింపునందుకుంది.[2]ఆమె అలా 70కి పైగా జానపద పాటలు పాడి 2021లో సొంతంగా ‘మౌనిక అఫీషియల్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి ‘సిక్కూదీసి కొప్పుకట్టి.. కొప్పునిండా పూలు వెట్టి’ పాట, మాతృదినోత్సవం సందర్భంగా ‘నెత్తుటి ముద్దయి.. నేలన పడ్డా.. కోటి నొప్పుల గురుతై పుడితివె అమ్మా.. ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే’ పాట, రాఖీ పండగ సందర్భంగా 'రక్షాబంధనం దీవెనలు ఇచ్చే రాఖీ వచ్చింది' పాట ద్వారా ప్రసంశలు అందుకొని,2021లో పుష్ప సినిమాలో పాడిన ‘సామీ.. సామీ..’ పాట ద్వారా మంచి గుర్తింపునందుకుంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (7 November 2021). "'సామీ.. సామీ..' కోసం ఏడాది ఎదురుచూశా!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Namasthe Telangana (17 March 2021). "నా కథే మారెరో రాములా!". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  3. 10TV (28 October 2021). "దేవిశ్రీ పాటల్లో తెలంగాణ టాలెంట్! సామీ సామీ సింగర్ మౌనిక యాదవ్ గురించి తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 November 2021. Retrieved 8 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Andrajyothy (29 October 2021). "ఏం పాటరా సామీ.. రికార్డులు బద్దలవుతున్నాయ్". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.

బయటి లింకులు

[మార్చు]