యత్నదోష అభ్యసన సిద్ధాంతం
యత్నదోష అభ్యసన సిద్ధాంతంను అమెరికాకు చెందిన ఇ ఎల్ థారన్ డైక్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని సంసర్గ వాద సిద్ధాంతం అనీ, ఎస్ ఆర్ టైపు సిద్దాంతం అనీ, థారన్ డైక్ సిద్ధాంతం అనీ అంటారు. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తన లో మార్పు కలిగి అభ్యసనం జరుగుతుంది అని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.[1]
థారన్ డైక్
[మార్చు]ఇతడిని జంతు మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడని అంటారు. ఆనిమల్ ఇంటలిజెన్స్, ది మేజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేవి ఇతడు రాసిన గ్రంథాలు. మనో వైజ్ఞానిక శాస్త్రం లోని ప్రజ్ఞ, అభ్యసనం పైన చాలా పరిశోధనలు చేశాడు. జంతువుల పైన ప్రయోగాలు చేస్తూ వాటి మానసిక స్థితిని అంచనా వేయటం లో ఇతడు అగ్రగణ్యుడు.[2]
ప్రయోగం
[మార్చు]యత్న దోష అభ్యసన సిద్ధాంతం ను ఒక పిల్లి పై చేశాడు. ఈ ప్రయోగం లో వాడిన బాక్సును పజిల్ బాక్సు అని అంటారు. బాగా ఆకలిగా ఉన్న ఒక పిల్లి ను ఈ పజిల్ బాక్సు లో ఉంచి, బయట దానికి కనబడేట్లు ఆహారాన్ని ఉంచాడు. ఈ పజిల్ బాక్సు లో ఉన్న మీట నొక్కితే బాక్సు తలుపు తెర్చుకునేలా అమర్చాడు.[3]
ప్రయోగ విధానం
[మార్చు]పిల్లి బాగా ఆకలిగా ఉండటంతో అది అటూ ఇటూ తిరుగుతూ చాలా ప్రయత్నాల తర్వాత మీట ను నొక్కింది. ఇలా నొక్కగానే తలుపు తెరుచుకుంది వెంటనే ఆహారాన్ని తిన్నది. ఆ తర్వాత మళ్లీ బాక్సులో ఉంచారు. మళ్ళీ ఆకలి కావడం తో అటూ ఇటూ తిరుగుతూ కొన్ని ప్రయత్నాల తర్వాత మళ్లీ మీట నొక్కి బయటకు వచ్చి ఆహారాన్ని తిన్నది. ఇలా ప్రతి సారి దోషాల సంఖ్య తగ్గటం ద్వారా నేరుగా మీట నొక్కి బయటకు వచ్చి ఆహారాన్ని తింటుంది.[4]
అభ్యసన నియమాలు
[మార్చు]ఈ సిద్ధాంతం ఆధారంగా సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలితం నియమం అని మూడు నియమాలను థారన్ డైక్ ప్రతిపాదించాడు.
సిద్ధాంత అనుప్రయుక్తం
[మార్చు]కొత్త విషయాలను నేర్చుకోవడం ఒక్కసారిగా కష్టసాధ్యం అనీ, నాలుగైదు ప్రయత్నాలు చేయాలని, యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం లో పట్టు సాధిస్తాం అనీ ఈ సిద్ధాంతం తెలుపుతుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Campbell, Donald T. (November 1960). "Blind variation and selective retention in creative thoughts as in other knowledge processes". Psychological Review. 67 (6): 380–400. doi:10.1037/h0040373.
- ↑ Thorndike E.L. 1898. Animal intelligence: an experimental study of the association processes in animals. Psychological Monographs #8.
- ↑ Thorpe W.H. The origins and rise of ethology. Hutchinson, London & Praeger, New York. p26. ISBN 978-0-03-053251-1
- ↑ Concise Oxford Dictionary p1489
- ↑ బాల్యదశ - వికాసం, అభ్యసనం. తెలుగు అకాడమీ డి ఎల్ ఎడ్ మొదటి సంవత్సరం.