యలమర్తి తిమ్మరాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యలమర్తి తిమ్మరాజా

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
నియోజకవర్గం తణుకు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 17 డిసెంబర్ 1947
కారంచేడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు జాగర్లమూడి గంగాభవాని, చంద్రమౌళి
జీవిత భాగస్వామి నారాయణమ్మ
బంధువులు యలమర్తి నారాయణరావుచౌదరి, రాజేశ్వరీదేవి (దత్తత తీసుకున్నవారు)
సంతానం అవంతి, రాజేశ్వరి, అవినాష్‌

యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుండి 2004 వరకు తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

యలమర్తి తిమ్మరాజా 17 డిసెంబర్ 1947లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, కారంచేడులో జాగర్లమూడి గంగాభవాని, చంద్రమౌళి దంపతులకు జన్మించాడు. ఆయనను చిన్నప్పుడే తన సమీప బంధువులు తణుకులోని యలమర్తి నారాయణరావుచౌదరి, రాజేశ్వరీదేవిలకు దత్తతగా తీసుకున్నారు. వైటీ రాజా హైదరాబాద్‌, విజయవాడలలో ప్రాథమిక విద్యను, బెంగళూరులో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

యలమర్తి తిమ్మరాజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1982 నుండి 1984 వరకు కొవ్వూరు అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను, 1989–1997 టీడీపీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా పని చేసి 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా పని చేశాడు. వైటీ రాజా 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బూరుగుపల్లి చిన్నారావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయాడు, వైటీ రాజా తణుకు కోపరేటివ్‌ కన్స్యూమర్స్‌ స్టోర్స్‌ అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.

మరణం[మార్చు]

యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 15 నవంబర్ 2021న మరణించాడు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమార్తెలు అవంతి, రాజేశ్వరి, కుమారుడు అవినాష్‌ ఉన్నారు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (15 November 2020). "మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  2. Andhrajyothy (15 November 2020). "తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీఆర్‌ ఇకలేరు". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  3. 10TV (15 November 2020). "తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీరాజా కన్నుమూత | tdp leader tanuku former mla passes away" (in telugu). Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)